సోమవారం 26 అక్టోబర్ 2020
Nizamabad - Jun 30, 2020 , 02:35:37

రైతు వేదికలు త్వరితగతిన పూర్తి చేయాలి

రైతు వేదికలు త్వరితగతిన పూర్తి చేయాలి

  • నిజామాబాద్  కలెక్టర్ నారాయణరెడ్డి 

ఇందూరు : రైతు వేదిక నిర్మాణ పనులపై దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ప్రభుత్వ స్థలాల గుర్తింపు, హరితహారం, రైతు వేదికల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడకముందే ఇసుక సమకూర్చుకోవాలన్నారు.హరితహారంలో ఇచ్చిన లక్ష్యాన్ని వచ్చే శనివారం నాటికి చేరుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఉదయం వేళల్లో మొక్కలు నాటే కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని సూచించారు.  పాఠశా లల్లో, పంచాయతీరాజ్, ఆర్ నేషనల్ హైవే రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, లత, డీఎఫ్ సునీల్, డీఆర్ రమేశ్ రాథోడ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.  


logo