మంగళవారం 14 జూలై 2020
Nizamabad - Jun 30, 2020 , 02:35:43

హరిత సంకల్పం

హరిత సంకల్పం

  • nకామారెడ్డి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
  • nస్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
  • nపద్మాజివాడి ఎక్స్ నుంచి బాన్సువాడ   వరకు మొక్కలు నాటే కార్యక్రమం సక్సెస్
  • ఒక్క రోజు.. 40 కిలో మీటర్ల రోడ్డు.. 40 వేల మొక్కల లక్ష్యం.. 

రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతమైంది. ఈ బృహత్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్ నుంచి బాన్సువాడ వరకు రోడ్డుకు ఇరువైపులా 

మొక్కలు నాటారు. స్పీకర్ పలు గ్రామాల్లో మొక్కలు నాటి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నతాధికారిని నియమించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 

-సదాశివనగర్ / గాంధారి 

/ బాన్సువాడ / బాన్సువాడ రూరల్  

సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్ నుంచి బాన్సువాడ వరకు 40కిలో మీటర్లు ఉన్న రోడ్డుకు ఇరువైపులా సోమవారం ఒక్క రోజే 40 వేల మొక్కలు నాటారు. పద్మాజివాడి ఎక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మార్గమధ్యంలో పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. పద్మాజివాడి ఎక్స్ భూంపల్లి స్టేజి, గాంధారి మండలంలోని గుడిమేట్, మాధవపల్లి, గాంధారి, తిమ్మాపూర్, రాంపూర్ పొతంగల్ మేడిపల్లి, గండివేట్, సర్వపూర్, మొండిసడక్, బాన్సువాడ మండలంలోని జక్కల్ బోర్లంక్యాంపుతండా, కొయ్యగుట్టతండా చివరగా బాన్సువాడలో మొక్కలు నాటారు.

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని, మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓపెన్ జీపులో పద్మాజివాడి ఎక్స్ నుంచి బాన్సువాడ వరకు పర్యటన కొనసాగించిన స్పీకర్ పలు గ్రామాల్లో మొక్కలు నాటి మాట్లాడారు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అనే పంచభూతాలను కాపాడుకోవాలని, లేకపోతే జీవరాశి మనుగడకు ముప్పుతప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గడిచిన ఐదేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 172 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆరో విడుత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అధికారులు, నాయకులు ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 65 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమం మహా యజ్ఞమని, ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. పద్మాజివాడి ఎక్స్ నుంచి బాన్సువాడ పట్టణం వరకు 40 కిలో మీటర్లు ఉన్న రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో 40 వేల మొక్కలు నాటామన్నారు. వర్షాలు సకాలంలో కురవాలన్నా, పర్యావరణం బాగుండాలన్నా మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని వివరించారు. మాచారెడ్డి మండలంలో అడవిని అభివృద్ధి చేయడం ద్వారా సగటు వర్షపాతం నమోదవుతున్నదని తెలిపారు. 

కార్యక్రమాల్లో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ జిల్లా పరిషత్ చైర్ దఫేదార్ శోభ, కలెక్టర్ శరత్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, పీడీ చంద్రమోహన్ డీఎఫ్ వసంత, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్సీ దామోదర్ సదాశివనగర్ ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, సర్పంచులు కవిత, శంభూ లలిత, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ మండల అధ్యక్షుడు గడీల భాస్కర్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో అశోక్, గాంధారి జడ్పీటీసీ శంకర్ ఎంపీపీ రాధా బలరాం, టీఆర్ మండలాధ్యక్షుడు సత్యంరావు, ఏఎంసీ చైర్మన్ సత్యం, విండో చైర్మన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ సంజీవ్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, టీఆర్ నాయకుడు పోచా రం సురేందర్ బాన్సువాడ అటవీశాఖ అధికారి గంగాధర్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ ఏఎంసీ చై ర్మన్ పాతబాలకృష్ణ, బుడ్మి, బాన్సువాడ, బోర్లం పీఏసీఎస్ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, ఎర్వాల కృష్ణారెడ్డి, సంగ్రాంనాయక్, టీఆర్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, సర్పంచులు నారాయణరెడ్డి, ప్రేమ్ సంగ్యానాయక్, నాన్కుబాయి, బోనాల సుభాష్, రమణారావు, భాస్కర్, ఎంపీటీసీ శ్రావణి, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాజ్, అలీమొద్దీన్ బాబా, కమటాల శ్రీనివాసరెడ్డి, బన్సీనాయక్, దేవేందర్ బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్ పాల్గొన్నారు.logo