బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jun 29, 2020 , 01:34:32

నిజామాబాద్‌ జిల్లా దవాఖానలోకొవిడ్‌ పరీక్షలు

నిజామాబాద్‌ జిల్లా దవాఖానలోకొవిడ్‌ పరీక్షలు

ఖలీల్‌వాడి: జిల్లా ప్రభుత్వ దవాఖానలో నేటి నుంచి కరోనా పరీక్షల నేపథ్యంలో శాంపిల్స్‌ను సేకరించనున్నారు.  ఇందుకోసం వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలకు సంబంధించి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం ఐసీఎంఆర్‌ నుంచి పరీక్షలు చేయడానికి అనుమతి వచ్చింది. ఈ మేరకు అధికారులు పరీక్షలు చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. సోమవారం కొన్ని శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తామన్నారు. రోజుకు 150 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని, వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ దవాఖానలో వైద్యులకు కరోనా పాజిటివ్‌ రాలేదని, వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. logo