ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jun 27, 2020 , 02:22:40

ప్రకృతి వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి

ప్రకృతి వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి

  • సెల్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇందూరు : నిజామాబాద్‌ జిల్లాలోని 530  పంచాయతీల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడుతలో 253 పంచాయతీలను ఎంపిక చేశామని తెలిపారు. ఈ పంచాయతీలకు అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం కేటాయించామన్నారు. రేపటిలోగా అధికారులు స్థలాలను గుర్తించాలన్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్‌ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మొదటి విడుతలో ప్రకృతి వనాలు ఏర్పాటు అయిన తర్వాత మిగతా గ్రామాల్లోని సర్పంచులకు దీనిపై శిక్షణ ఇప్పిస్తామన్నారు. వన సేవకులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఫారెస్ట్‌ అధికారుల సూచనల ప్రకారం ఐదు రోజుల్లో మొక్క లు నాటాలన్నారు.  ప్రకృతి వనంలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఇందుకోసం జిల్లా వ్యాప్తం గా 12 మంది సీనియర్‌ ఆఫీసర్లను నియమించామన్నారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో అటవీశాఖ అధికారులు, ఎంపీడీవోలు, డీఆర్డీఏ అధికారులు, డీపీవో తదితరులు పాల్గొన్నారు. 


logo