శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Jun 26, 2020 , 00:36:56

మైనార్టీల అభ్యున్నతికి కృషి: ప్రభుత్వ విప్‌

మైనార్టీల అభ్యున్నతికి కృషి: ప్రభుత్వ విప్‌

కామారెడ్డి: మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో 46 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్‌ మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు షాదీ ముబారక్‌ పథకంతో అండగా నిలుస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కే. ముజీబుద్దీన్‌, కమిషనర్‌ దేవేందర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.