గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jun 25, 2020 , 00:46:21

రైతును నెంబర్‌వన్‌గా నిలుపడమే లక్ష్యం

రైతును నెంబర్‌వన్‌గా నిలుపడమే లక్ష్యం

దేశంలోనే తెలంగాణ రైతును నెంబర్‌వన్‌గా నిలుపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలం పాలెం, ముప్కాల్‌తోపాటు వేల్పూర్‌ మండల కేంద్రంలో తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే సీఎం కేసీఆర్‌ రైతుల కరెంటు కష్టాలు తీర్చారన్నారు. రాష్ట్రంలో రూ.నాలుగువేల కోట్లతో చెక్‌డ్యాముల నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టిందని వివరించారు. రైతువేదికలు అన్నదాతలకు వరంలాంటివన్నారు. రైతులు వారి సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.  

వేల్పూర్‌/కమ్మర్‌పల్లి/ముప్కాల్‌/ మోర్తాడ్‌ : తెలంగాణ రైతును దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలుపడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం రైతువేదికల నిర్మాణాన్ని తలపెట్టిందని తెలిపారు. బుధవారం ఆయన కమ్మర్‌పల్లి, ముప్కాల్‌ మండల కేంద్రాల్లో,  మోర్తాడ్‌ మండ లం పాలెం గ్రామంతోపాటు వేల్పూర్‌ మండల కేంద్రంలో తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణానికి కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమానికి ప్రభు త్వం నిరంతరం శ్రమిస్తున్నదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్లస్టర్ల పరిధిలో రైతు వేదిక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తామని సీఎం ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం వేల్పూర్‌లో రైతు వేదిక నిర్మిస్తున్నామని తెలిపారు. సమైక్యపాలనలో రైతులు కరెంటు, సాగునీటికి  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.  రాష్ట్రం సాధించుకున్న ఏడాదిన్నర కాలంలో సీఎం కేసీఆర్‌ రూ.22 వేల కోట్లు ఖర్చు చేసి నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తున్నారని గుర్తుచేశారు. కాకతీయుల కాలం లో నిర్మించిన కాలువలు శిథిలావస్థకు చేరగా తె లంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం కింద వాటికి పూర్వవైభవం తెచ్చిందన్నారు. రూ.11 కోట్లతో నవాబ్‌ కెనాల్‌ ఆధునీకరించడంతో చివరి ఆయకట్టు వరకు లిఫ్ట్‌ ద్వారా నీరు అందుతుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కప్పల వాగు, పెద్ద వాగులపై 10 చెక్‌డ్యాముల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఇది వరకే 9 చెక్‌డ్యాముల పనులు పూర్తయ్యాయని వివరించారు. కొత్తగా నిర్మించే మరో పది చెక్‌డ్యాములు పూర్తయితే సంవత్సరం మొత్తం వాగు లు నీటితో కళకళలాడుతాయని తెలిపారు. కాళేశ్వ రం పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని,  ఇది వరకే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయన్నారు.వరద కాలువపై 9 తూములు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని 16 చెరువులకు నీరు అందించడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతలు కాలు మీద కాలు వేసుకుని పంట అమ్మే రోజు రావాలని.. ఆ మేరకు సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కండ్ల ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా.. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విమర్శించడం సరికాదని హితవు పలికారు.  లాక్‌డౌన్‌తో సోయా విత్తనాలు అందించడంలో ఇబ్బందులు తలెత్తాయ న్నారు. దీంతో కొంత వరకు రైతులకు నష్టం జరిగిందని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలైన గట్టుపొడిచిన వాగు, వేముగంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఈ ప్రాంతవాసుల ఏండ్ల కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. అనంతరం వేల్పూర్‌ జీపీకి మంజూరైన ట్రాక్టర్‌ను  కలెక్టర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పాలెం, ముప్కాల్‌లో మొక్కలు నాటా రు.హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎఫ్‌వో సునీల్‌, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో కరుణాకర్‌, తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి, వ్యవసాయ శా ఖ అధికారి ప్రకాశ్‌గౌడ్‌, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్‌ ఎంపీపీ సురేశ్‌, ఎంపీటీసీ మహేశ్‌, ఆ యా గ్రామాల సర్పంచులు తీగల రాధ, రాజేశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్‌, మహేశ్‌, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రా ములు, పార్టీ మండల కన్వీనర్‌ నాగధర్‌, రైతు బం ధు సమితి మండల కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, మిట్టాపల్లి మహిపాల్‌, సామ మహిపాల్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లిలో ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ   రాధ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ మంజుల, కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌, మండల కో-ఆర్డినేటర్‌ బద్దం రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ చై ర్మన్‌ రేగుంట దేవేందర్‌, రైతుబంధు  సమితి గ్రామ శాఖ కన్వీనర్‌   నరేందర్‌, రఘు, సర్పంచులు గడ్డం స్వామి, పద్మ, ఎం పీటీసీలు  సుధాకర్‌,  అనిల్‌ పాల్గొన్నారు.

ముప్కాల్‌లో ఎంపీపీ సామ పద్మ, జడ్పీటీసీ  బద్దం నర్సవ్వ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ శేఖర్‌ రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్‌ నాగంపేట్‌ ముత్తెన్న, కో- ఆప్షన్‌ సభ్యుడు మునీరుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సామ వెంకట్‌రెడ్డి, బద్దం నర్సారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

పాలెంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, జడ్పీటీసీ బద్దం రవి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు ఏలియా, సర్పంచ్‌ సంతోష్‌, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ పర్స దేవ న్న, రవి, ఆరిఫ్‌, అశోక్‌, శంకర్‌ పాల్గొన్నారు.

త్వరలోనే పార్టీ కార్యాలయం ప్రారంభం 

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ నగరంలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని బుధవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌ లేకపోతే ఇప్పటికే కార్యాలయం ప్రారంభమయ్యేదన్నారు. సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. మంత్రి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగరెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.