మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Jun 24, 2020 , 02:48:54

బ్యాంకు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

బ్యాంకు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి

మేనేజర్లు, సిబ్బందితో  పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ తదితర అంశాల పై సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌: సహకార బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది  మాస్కు కచ్చితంగా ధరించాలని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్లతో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ, లావాదేవీలు, రుణాల రికవరీ తదితర అంశాలపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కరోనా నేపథ్యంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకుకు వచ్చే కస్టమర్లు మాస్కు లు ధరించేలా చూడాలన్నారు. శానిటైజర్‌ బాటిల్స్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రోజు వారీగా జరిగే లావాదేవీలన్నీ నమోదు చేయాలని సూచించారు. అన్ని రకాల రుణాలను ఈ నెలాఖరులోపు రికవరీ చేయాలని మేనేజర్లను ఆదేశించారు. బ్యాంకుల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో సుమమాల, జీఎంలు అనుపమ, లింబాద్రి, డీజీఎంలు, ఏజీఎంలు, అన్ని బ్రాంచుల మేనేజర్లు,  సిబ్బంది పాల్గొన్నారు. logo