శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jun 23, 2020 , 01:12:23

ఉజ్వల సంబురం

ఉజ్వల సంబురం

  • స్వరాష్ట్రంలో అభివృద్ధి జోరు.. 
  • lఉమ్మడి పాలనలో నత్తనడకన పనులు
  • lప్రాజెక్టుల నిర్వహణ గాలికి
  • lస్వరాష్ట్రంలో పెండింగ్‌ పనులన్నింటికీ మోక్షం
  • lఅభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా

చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కమ్మర్‌పల్లి, మోర్తా డ్‌ మండలాలకు సాగు నీరు అందించేందుకు నిర్దేశించింది. 2012లో పూర్తి చేసినప్పటికీ కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం లీకేజీలతో  రైతులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చలేదు. తెలంగాణ సర్కారు ప్రోత్సాహంతో రూ. 14కోట్లతో వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకువచ్చారు. సాగునీటి వనరులు తక్కువగా ఉన్న భీమ్‌గల్‌ మండలంలో 2012లో కాంగ్రెస్‌ హయాంలో వేముగంటి ప్రా జెక్టును మంజూరు చేశారు. మంజూరే తప్ప  పని  ప్రారంభించలేక పోయారు. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చాక రూ.8.41కోట్లతో 2018లో ప్రాజెక్టు పూర్తయ్యింది.దీంతో ప్రాజెక్టు దిగువ గ్రామాలకు సాగు నీటి గోస తీరింది. ఎస్సారెస్పీ ఎస్కేప్‌ గేట్ల విషయంలోనూ తెలంగాణ సర్కారు చొరవ చూపి నూతన గేట్లను ఏర్పాటు చేసింది. కాకతీయ కాలువ నీటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి, పశు, పక్ష్యాదులకు వేసవిలో గోదావరిలోకి నీటిని వదలడానికి ఎస్కేప్‌ గేట్లను వినియోగిస్తుంటారు. కాంగ్రెస్‌ హయాంలో ఎస్కేప్‌ గేట్ల విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కాంగ్రెస్‌, టీడీపీ పా లకుల కుట్రలకు అడుగడుగునా బలైంది.  సా గునీరు, సంక్షేమ, అభివృద్ధి ఫలాలను క్షేత్ర స్థాయికి చేర్చడంలో స్థానిక నేతలు ప్రదర్శించి న తీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన సైతం పాలకులకు రాని దుస్థితి ఉండేది.  ఆరేండ్ల క్రితం నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ క్షేత్రస్థాయికి   కృషి చేస్తున్నారు. ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపులు, మంజీర నదిపై బ్రిడ్జిల నిర్మాణం, ని జాంసాగర్‌ ప్రధాన కాలువ మరమ్మతులు, ఎ స్సారెస్పీ వరద కాలువ పనులన్నింటినీ తెలంగాణ సర్కారు రూ.వందల కోట్లు వెచ్చించి పూర్తి చేసింది. తద్వారా వేలాది మంది రైతన్నలకు మేలు చేకూరుతున్నది. కాంగ్రెస్‌ హయాం లో ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వదిలేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ సర్కారు పూర్తి చేయించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది.

మంజీర మురవంగా...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు కనీసం కాలువల మరమ్మతులకు పైసా నిధులివ్వలేని దుస్థితి ఉండేది. సీఎం కేసీఆర్‌ చొరవతో మం జీరా నదిపై పదుల సంఖ్యలో ఆనకట్టల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కాగా, నిధులు సైతం విడుదలయ్యాయి. రూ.15.98 కోట్లతో బీర్కూర్‌ చెక్‌డ్యాం, రూ.28.29కోట్లతో చింతల్‌నాగారం, రూ.7.5 కోట్లతో కుర్తి వద్ద బ్రిడ్జి కమ్‌ చెక్‌ డ్యాం నిర్మాణాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జుక్కల్‌ నియోజకవర్గంలోని ఐదు ప్రధానమైన వాగు లపై ఎక్కడికక్కడే చెక్‌డ్యాంల కోసం రూ. 61.90 కోట్లు మంజూరయ్యాయి. జుక్కల్‌, ని జాంసాగర్‌, బిచ్కుంద, పిట్లం, మద్నూర్‌ మం డలాల పరిధిలోని వాగులు, వంకల్లో చెక్‌డ్యాం లు నిర్మాణం కానున్నాయి. జుక్కల్‌ నియోజక వర్గానికి మంజూరైన 12 చెక్‌డ్యాంలలో రెం డింటిని మంజీరా నదిపై నిర్మించబోతున్నారు. మిగిలిన 10 ఆనకట్టలను ఆయా మండలాల్లో ని వాగులపై నిర్మిస్తారు. నిజామాబాద్‌ జిల్లా  బాల్కొండ నియోజకవర్గంలోనూ 23 చెక్‌డ్యాంల నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. రూ.60 కోట్లతో కప్పల వాగు, పెద్ద వాగులపై ఆనకట్టల నిర్మాణానికి శంకుస్థాపనలు సైతం చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 10 ఆనకట్టల నిర్మాణానికి రూ.51 కోట్లు ప్రభు త్వం కేటాయించింది. 

నిజాంసాగర్‌ ప్రధాన కాలువకు మహర్దశ.. 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చారిత్రక భారీ నీటి పారుదల ప్రాజెక్టులను సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేయగా స్థానిక నాయకులు సైతం అదే ధోరణిని అవలంబించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు మేలు చేసే కాలువల మరమ్మతు పనులను కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత నిజాంసాగర్‌ ప్రధాన కాలువ అద్భుతమైన సీసీ లైనింగ్‌ పనులతో కొంగొత్తగా కనిపిస్తున్నది.  వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో ప్రధాన కాలువ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ప్రధాన కాలువను ఆధునీకరించారు. సీసీ లైనింగ్‌తో పాటుగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌, సబ్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను పటిష్టపరిచారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ఈ పనుల కోసం విశేషంగా కృషి చేశారు.

ఎస్సారెస్పీకి జలజీవం.. 

ఎస్సారెస్పీ నీటి మట్టం 1045 అడుగుల నుంచే జిల్లాలో ఎస్సారెస్పీ దిగువన ఉన్న చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి లిఫ్ట్‌, బోడపల్లి లిఫ్ట్‌, నవాబు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించేందుకు లక్ష్మీ లిఫ్ట్‌ను నిర్మించారు. కాంగ్రెస్‌ హయాంలో 2007లో ఈ పనులు ప్రారంభించి నిర్లక్ష్యంగా వదిలేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కృషితో 2014లో పూర్తయ్యింది. కమ్మర్‌పల్లి మండలంలోని ఇనాయత్‌ నగర్‌ అటవీ ప్రాంతంలో గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించినా..  చెరువులకు నీరందించే కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక మంత్రి రూ.11కోట్లు మంజూరు చేయించి  కాలువలను పూర్తి చేయించారు. మానాలలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఇక్కడి గిరిజను ల దశాబ్దాల కల. ఈ పాఠశాల మంజూరు చేస్తామని 2005లో మానాలకు వచ్చిన నాటి సీఎం వైఎస్‌ హామీ ఇచ్చారు. పదేండ్ల కాంగ్రెస్‌ హయాంలో మంజూరు కాని గిరిజన గురుకుల పాఠశాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మం జూరు చేసి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టాక పునరుజ్జీవ పథకంలో భాగంగా  కాళేశ్వరం జలాలు వరద కాలువ ద్వారా పోచంపాడ్‌ వర కు వచ్చి చేరాయి.కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీపై ఒత్తిడి తగ్గి నీటి నిల్వకు అవకాశం లభించింది. ఎండాకాలంలోనూ 30 టీఎంసీల నీరు నిలకడగా ఉండడం కండ్ల ముందున్న వాస్తవం.


logo