శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jun 21, 2020 , 01:54:51

ఆరోగ్య ‘యోగ’ం

ఆరోగ్య ‘యోగ’ం

  • యోగాపై పెరిగిన అవగాహన
  • ఉమ్మడి జిల్లాలో పెరిగిన శిక్షణ కేంద్రాలు 
  • రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సాధకులు
  • నేడు ప్రపంచ  యోగా దినోత్సవం

ఇందూరు : సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా వైపు పరుగులు తీస్తున్నారు. నోటికి రుచికరంగా అనిపిస్తుందని అదే రుచికి అలవాటు పడి ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలను విస్మరిస్తున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో పని ఒత్తిడి, బాధ్యతల నిర్వహణ వంటివి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో క్షణికావేశానికి గురై అనర్థాలకు దారి తీస్తున్న సందర్భాలూ లేక పోలేవు. వీటన్నింటి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా అండగా నిలుస్తుంది. ప్రతినిత్యం యోగా చేయాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.

ఇందూరులో... 

1983లో జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో శ్రీ దయానంద యోగా కేంద్రం పేరున యోగా కేంద్రాన్ని స్థాపించారు. ముక్కా దేవేందర్‌ గుప్తా ఆధ్వర్యంలో ఆయన వ్యవస్థాపక పాలనలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ట్రస్ట్‌గా ప్రారంభించారు. ఆనాడు 30 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యోగా కేంద్రంలో ఇప్పటికీ కొన్ని వందల మంది శిక్షణ పొందుతున్నారు. 1987లో ప్రప్రథమంగా జిల్లా కేంద్రంలోని కర్షక్‌ భవన్‌లో జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించారు. సుమారు 200 మంది యోగాలో డిప్లొమా పొందిన వారు ఉన్నారు. నిజామాబాద్‌లో భిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాలు వారం రోజులపాటు నిర్వహిస్తారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి పలువురిని శిక్షకులుగా తయారు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అడ్వాన్స్‌ యోగా తరగతులు, మహానంది, విజయవాడ లాంటి జిల్లాల్లో నిర్వహిస్తారు. 


logo