గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jun 19, 2020 , 02:37:25

తెలంగాణకోసం తపించిన వ్యక్తి నారాయణరెడ్డి

తెలంగాణకోసం  తపించిన వ్యక్తి నారాయణరెడ్డి

n కేసీఆర్‌కు సలహాలు, సూచనలు.. పుస్తకాలనూ ఇచ్చారు

n రైతులకోసం నిరంతరం పోరాడారు

n మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

n సుంకెట్‌లో విగ్రహావిష్కరణ

మోర్తాడ్‌ : తెలంగాణ కోసం తపించిన వ్యక్తి నారాయణరెడ్డి అని, తెలంగాణ జెండా ఎవరు ఎత్తుకు న్నా అండగా నిలిచేవారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని సుం కెట్‌లో మాజీ ఎంపీ నారాయణరెడ్డి విగ్రహాన్ని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోకలిసి ప్రశాంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణరెడ్డి రైతుల గుండెల్లో నిలిచిన వ్యక్తి అని, ఏదో ఒక పార్టీ నామినేట్‌ చేస్తే ఎదిగిన వ్యక్తి కాదని అన్నారు. కేసీఆర్‌కు గైడ్‌గా ఉన్నారని, కేసీఆర్‌కు తెలంగాణకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఇవ్వగా తన కండ్లతో చూ శానని అన్నారు.తన తండ్రి సురేందర్‌రెడ్డి, తాత కృష్ణారెడ్డి తనకు నారాయణరెడ్డి గురించి చెప్పే వార ని అన్నారు. ది టాలెస్ట్‌ పర్సనాలిటీ ఆఫ్‌ నిజామాబాద్‌ అని ఆయనను అంటారన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ మహామేధావి, తెలంగాణ వాది కేసీఆర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చిన నారాయణరెడ్డిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. రైతుల కోసం నిరంతం పోరాడి న నారాయణరెడ్డి విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగుశ్రీనివా స్‌, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సర్పంచ్‌ కడారిశ్రీనివాస్‌,ఎంపీటీసీ ప్రశాంత్‌, తీగెల గణేశ్‌, సుభాష్‌, సందీప్‌, గ్రామకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవారిని రప్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని, ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలని కోరుతూ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌జిల్లాలకు చెందిన వారు మం త్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. మంత్రులు మాట్లాడుతూ.. మీరిచ్చిన వినతిపత్రాన్ని కేటీఆర్‌కు అందజేస్తామని చెప్పారు. గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, కానీ కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. కేటీఆర్‌ ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని అన్నారు. కరోనా నేపథ్యంలో గల్ఫ్‌నుంచి వచ్చినవారికి కేరళ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్‌ సదుపాయం కల్పించలేదని, కానీ తెలంగాణకు గల్ఫ్‌నుంచి వచ్చిన వారికి ఉచిత క్వారంటైన్‌ కల్పించామని అన్నారు. త్వరలోనే గల్ఫ్‌లో ఉన్నవారిని రప్పించేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదని చెప్పారు. 


logo