శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jun 19, 2020 , 02:35:16

మాట ఇచ్చాం..కాళేశ్వరం నీళ్లు తెచ్చాం

మాట ఇచ్చాం..కాళేశ్వరం నీళ్లు తెచ్చాం

n సీఎం సహకారంతో  16 గ్రామాల్లో సాగునీటి  సమస్య పరిష్కారం  

nమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

కమ్మర్‌పల్లి /వేల్పూర్‌: కాకతీయ కాలువ కింద 16 గ్రామా ల రైతులు సాగు నీటి కోసం ఎదుర్కొంటున్న తిప్పలు తీరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వరద కాలువలోకి కాళేశ్వరం నీటిని తెచ్చి రైతుల తిప్పలు తీర్చామని రా ష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో 300 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వరద కాలువలో మూడు సార్లు ఎదురుగా ప్రవహించి ఎస్సారెస్సీ ప్రాజెక్టు గేట్లను ముద్డాడాయన్నారు. గురువారం ఆయన కమ్మర్‌పల్లి మండ లం నాగాపూర్‌, ఉప్లూర్‌, వేల్పూర్‌ మండ లంలో ని పోచంపల్లి, అంక్సాపూర్‌ గ్రామాల్లో నిర్మిస్తు న్న తూములను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద కాలువలో గతంలో ఎక్కువ ఎత్తులో నిర్మించిన తూములతో ఉపయోగం తక్కువగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్‌కు విన్నవించి తాజాగా బాల్కొండ నియోజక వర్గం పరిధిలో వరద కాలువ వెంట తొమ్మిది తూములను సుమారు రూ.2.85 కోట్లతో తక్కు వ ఎత్తులో నిర్మిస్తున్నామన్నారు. దీంతో  పది గ్రామాల పరిధిలో 15 చెరువులను ఎండాకాలం సైతం నింపుకోవచ్చన్నారు. వరద కాలువలో నూతనంగా నిర్మిస్తున్న తూముల పనులు దాదా పు పూర్తయ్యాయని తెలిపారు.ఈ ప్రాంత రైతు లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది తన ఆ కాంక్ష అన్నారు. తూముల నిర్మాణానికి కృషి చేసినందుకు మంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి వేల్పూర్‌లోని తన స్వగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వరద కాలువ ఈఈ సుధాకిరణ్‌, ఎంపీపీ లోలపు గౌతమి, కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాలవత్‌ ప్ర కాశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌  చైర్మన్‌ రే గుంట దేవేందర్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యు డు బద్దం చిన్నారెడ్డి, మండల కో-ఆర్డినేటర్‌  రాజేశ్వర్‌, సర్పంచులు గడ్డం స్వామి, అనంత్‌రా వు, రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీలు సుప్రియ,  సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. logo