శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jun 18, 2020 , 01:15:23

నియోజక వర్గానికి వెయ్యి కల్లాలు

నియోజక వర్గానికి వెయ్యి కల్లాలు

l పంట నూర్పిడి, ఆరబోత కోసం.. 

l ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ 

l నిజామాబాద్‌ జిల్లాకు రూ.31.59 కోట్లు, కామారెడ్డికి రూ.31.67 కోట్లు కేటాయింపు 

l మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు  

l హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 

మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో రాత్రి వరకు విధులు ముగించుకొని సహదేవ్‌ అనే హోంగార్డు ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌కు బయల్దేరాడు. ఏర్గట్ల  తాళ్ల రాంపూర్‌ మధ్యలో రోడ్డుపై ఆరబోసిన పంట కుప్పల పక్కన ఉంచిన రాళ్ల కారణంగా బైక్‌ స్లిప్‌ అయి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన యాసంగి సీజన్‌లో జరిగింది. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలా రోడ్లపై పంట దిగుబడులను రైతులు ఆరబోస్తున్నారు. పంట కోత సీజన్‌లో అనేక ప్రమాదాలు జరుగు తూనే ఉన్నాయి. రైతులు పండించిన పంటలను ఆరబోసేందుకు, నూర్పిడి చేసేందుకు కల్లాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం మార్గదర్శకాలు జారీచేసిన ప్రభు త్వం కల్లాలు నిర్మించేందుకు ఉమ్మడి జిల్లాకు నిధులను కూడా మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                           - మోర్తాడ్‌ 

రైతుల పక్షపాతిగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులు పంట దిగుబడుల నూర్పిడి, ఆరబెట్టేందుకు కల్లా ల ఏర్పాటుకోసం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈజీఎస్‌లో భాగంగా నిర్మించాలని, అందుకు సంబంధించి నిధులను కేటాయించడంతో పాటు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల్లో కల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో పంటల ఆరబోత కారణంగా జరిగే ప్రమాదాలను నివారించవచ్చు. ఏండ్ల తరబడి నూర్పిడి కల్లాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్న రైతుల కల త్వరలో నెరవేరబోతున్నది.

నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు.. 

ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి యేడూ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని అర్హులను ఎంపిక చేస్తారు. కల్లాల ఏర్పాటు కోసం ఈ సంవత్సరం నిజామాబాద్‌ జిల్లాకు రూ.31.59కోట్లు, కామారెడ్డి జిల్లాకు రూ.31.67 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. భూమి కలిగి ఉన్న రైతులు కల్లాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రైతుల సంఖ్యను, డిమాండ్‌ను బట్టి ఏ గ్రామానికి ఎన్ని కల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నది కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ ఉండగా, ఇతరులు పదిశాతం కంట్రిబ్యూషన్‌ చెల్లించాల్సి ఉంటుంది. కల్లాల నిర్మాణ పనుల ప్రకారం రెండు విడుతలుగా డబ్బులు ఇస్తారు. కల్లాల కోసం దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న తరువాత ఎంపీడీవో, ఏపీవో, ఏవోలు వాటిని పరిశీలించి ఫీల్డ్‌విజిట్‌ చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం ఏపీవో, ఏఈవో, టీఏలు గ్రామానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి కొలతలు చూసి ఎస్టిమేషన్‌ తయారు చేస్తారు. అనంతరం పనులు చేసుకొనేందుకు అనుమతి ఇస్తారు.

మూడు రకాల కల్లాలు.. 

రైతులు వారికున్న భూమిని, అవసరాల ప్రకారం మూడు రకాల కల్లాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అ నుమతిని ఇచ్చింది. కల్లాల సైజుకు అనుగుణంగా ధరను కూడా నిర్ణయించారు. ఇందులో రైతులకు ఉన్న భూమి, అవసరం మేరకు 50, 60, 70 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులిస్తారు. 50 చదరపు అడుగుల కల్లం ఏర్పాటుకు రూ.56 వేలు, 60 చదరపు అడుగుల కల్లానికి రూ.68వేలు, 75 అడుగుల కల్లానికి రూ.85 వేలు యూనిట్‌ కాస్ట్‌గా ప్రభుత్వం నిర్ణయించిం ది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. కల్లాల ఏర్పాటు కోసం త్వరలోనే అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు.


logo