గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jun 17, 2020 , 02:41:22

‘పాజిటివ్‌' కలకలం

‘పాజిటివ్‌' కలకలం

 కరోనా వైరస్‌ మళ్లీ కలవరపెడుతున్నది. ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. మంగళవారం తాజాగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో అప్రమత్తమైన యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. మొదటి నుంచి కరోనా కట్టడిపై చైతన్యం ప్రదర్శిస్తున్న గ్రామాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి జరిమానాలు విధించేలా తీర్మానాలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే బాజిరెడ్డి కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

n మళ్లీ వెలుగుచూస్తున్న  కరోనా కేసులు

n ఉమ్మడి జిల్లాలో తాజాగా ఆరుగురికి నిర్ధారణ

n అప్రమత్తమైన అధికారులు

n పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

n బాజిరెడ్డి కుటుంబ సభ్యులకు నెగెటివ్‌

ఆర్మూర్‌ :మండలంలోని మగ్గిడిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. గ్రామంలో ఇటీవల పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి  తల్లి, భార్య, మేనత్త, స్నేహితుడికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. వీరిని కూడా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించామ న్నారు. పాజిటివ్‌ కేసులు నమోదుకా వడంతో  అధికార యంత్రాంగం అప్రమత్త మైం ది.  సర్పంచ్‌ సుమలతా నర్సయ్య ఆధ్వర్యంలో అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పాజిటివ్‌ వచ్చి న వారు ఎవరెవరితో కలిశారో వివరాలు తెలుసుకుని పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు.  ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నా రు. గ్రామంలో మొదట పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిసిన 48 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచా రు. నిజామాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తికి టె స్టుల్లో పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

కామారెడ్డి జిల్లాలో మరో కేసు.. 

విద్యానగర్‌ /గాంధారి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారికి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా సోమవారం ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద 18 మంది శాంపిళ్లను  హైదరాబాద్‌కు పంపారు. మం గళవారం వచ్చిన రిపోర్టులో గాంధారికి చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రాగా, 17 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. గాంధారికి చెందిన వ్యక్తికి  కరోనా ఎలా సోకింది, ఎవరి ద్వారా వ్యాప్తి చెందిందనే కోణం లో వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. గాంధారికి చెందిన వ్యక్తి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడించారు. ప్రజలు ప్ర యాణాలు, ఫంక్షన్లు, విందులకు దూరంగా ఉండాలని, భౌతికదూ రం పాటించాలని సూచించారు. పట్టణంలోని రాంమందిర్‌ రోడ్‌, అయ్యప్ప కాలనీ లో మెడికల్‌ ఆఫీసర్‌ సుజాయత్‌ అలీ, వైద్య అధికారుల ఆధ్వర్యంలో సర్వే నిర్వ హించి 3700 మంది వివరాలను సేకరించారు.

భయం గుప్పిట్లో గాంధారి..

ఎలాంటి కరోనా కేసులు లేక ప్రశాంతంగా ఉన్న గాంధారిలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రజ లు భయభ్రాంతులకు గురవుతున్నారు. మండల కేంద్రానికి చెందిన వ్యక్తి  28 రోజులుగా ఎవరెవరి ని కలిశాడోనని గ్రామస్తులు భయపడుతున్నారు.

ఊపిరిపీల్చుకున్న మోర్తాడ్‌  

మోర్తాడ్‌ :  మండల కేంద్రంలో ఒకరికి కరోనా పా జిటివ్‌ అని తేలడంతో ఆయనను దవాఖనకు తరలించారు. ఆయనతో కాంటాక్ట్‌ ఆయన ఏడుగురి నుంచి ఆదివారం రాత్రి వైద్యాధికారులు శాంపిళ్లను సేకరించారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో అందరికీ నెగెటివ్‌ వచ్చింది. దీంతో మోర్తాడ్‌ ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

బాజిరెడ్డి కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ 

నిజామాబాద్‌ రూరల్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగ తి తెలిసిందే. కాగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే కుటుంబీలకు  పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. ఎమ్మెల్యే తనయుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌తో పాటు ఆయన భార్య, పిల్లలు, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు, గన్‌మెన్లు, సిబ్బంది, పని మనుషుల నుంచి ఆదివారం ఆరోగ్య సిబ్బంది రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. మంగళవారం ఉదయం అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు బాజిరెడ్డి జ గన్‌ తెలిపారు. దీంతో  టీఆర్‌ఎస్‌ నాయకు లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.  ఎమ్మెల్యేతో  కాంటాక్ట్‌ అయిన వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. 

డిచ్‌పల్లి మండలంలోని బీబీపూర్‌ తండాలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డిని కాంటాక్ట్‌ అయిన ఎమ్మెల్సీ వీజీ గౌ డ్‌కు శాంపిళ్లను సైతం అధికారులు హైదరా బాద్‌కు పంపారు. వీజీ గౌడ్‌కు నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


logo