గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jun 16, 2020 , 01:54:12

హోంక్వారంటైన్‌లో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు

హోంక్వారంటైన్‌లో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు

నిజామాబాద్‌ రూరల్‌/ డిచ్‌పల్లి : రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆయనను కలిసిన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకు లు, కార్యకర్తలు ముందు జాగ్రత్త చర్య ల్లో భాగంగా హోం క్వారంటైన్లలో ఉం డిపోయారు. ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఆ యన నివాస ప్రాంగణంలో కలిసిన ప లువురు ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.  తాజాగా అర్బ న్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ కాగా చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డికి పాజిటివ్‌ తేలినందున పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధైర్యపడొద్దని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారందరూ 14 రోజుల పాటు హోం క్వారంటైన్లలోనే ఉండాలని సూచించారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే తనకు ఫోన్‌ చేయాలని జగన్‌ కోరారు. 

ప్రైమరీ కాంటాక్ట్‌ గుర్తింపులో  వైద్యాధికారులు 

డిచ్‌పల్లి మండలంలోని బీబీపూర్‌ తం డా సమీపంలో శనివారం నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేను కలిసినవారిని గుర్తించే పనిలో వైద్యసిబ్బంది నిమగ్నమయ్యారు. సోమవారం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల వద్ద వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి వారి వివరాలను సేకరించారు. ఎమ్మెల్యేకు దగ్గరగా ఎవరెవరు ఉన్నారో  గుర్తించి వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.   

 శాంపిళ్ల సేకరణ..

మోర్తాడ్‌/ విద్యానగర్‌: నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం కలకలం రేపింది. సోమవారం మోర్తాడ్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంపత్‌కుమార్‌, డాక్టర్‌ రతన్‌కుమార్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. మండల కేంద్రం లోని వ్యాపార దుకాణాలను మూసి వేయించారు. పాజిటివ్‌ వ్యక్తితో ప్రైమరీకాంటాక్ట్‌లో ఉన్న 48 మందిని గుర్తించి వారికి క్వారంటైన్‌ ముద్రలు వేశారు. బద్దంవాడ ఏరియాలో ఇతరులు రాకుండా చర్యలు చేపట్టారు. వైద్యబృందం, అంగన్‌వాడీ టీచర్లతో ఎనిమిది టీంలను ఏర్పాటు చేశారు. వీరంతా గ్రామంలో క్వారంటైన్‌లో ఉన్న వారిని పరిశీలించడంతో పాటు ఇం టింటా కొవిడ్‌ సర్వే నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల వ్యాపారి కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌ రావడంతో వారి ప్రైమరీ కాంటాక్ట్‌ కింద కామారెడ్డి నుంచి 16, బాన్సువాడ నుంచి ఇద్దరి రక్త నమూనాలు సేకరించారు. వీటిని హైదరాబాద్‌కు పంపించినట్లు ప్రభుత్వ దవాఖాన నోడల్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. రిపోర్టులు మంగళవారం వస్తాయని చెప్పారు. 


logo