మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Jun 16, 2020 , 01:54:14

భిక్కనూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

భిక్కనూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

భిక్కనూర్‌(రాజంపేట): కరోనాపై భిక్కనూరు మండలప్రజలు యుద్ధం ప్రకటించారు. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఆదివారం పంచాయతీ పెద్దలు పట్టణంలోని పలు వ్యాపారస్తులతో అవగాహన సదస్సు ఏర్పాటుచేసి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప వైరస్‌ బారి నుంచి గ్రామాలను కాపాడుకోలేమని అభిప్రాయపడ్డారు. సమష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని పాటించాలని తీర్మానించుకున్నారు. 

తీర్మానాలు..నిబంధనలు

  • lమండల కేంద్రంలోని దుకాణ సముదాయాలు ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం రెండు గంటల వరకే తెరిచి ఉంచాలి.
  • lప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలి.
  • lప్రతి ఒక్కరూ మాస్క్‌  ధరించాలి.
  • lప్రతి దుకాణం వద్ద శానిటైజర్‌ ఫుట్‌ స్టాండ్‌ను ఏర్పాటు చేయాలి.
  • lటిఫిన్‌ సెంటర్లతోపాటు హోటళ్లు రెండు గంటల వరకే తెరిచి ఉంచాలి.

పై నిబంధనలు ఉల్లంఘించే వారికి ఐదు వేల రూపాయలు జరిమానా విధించాలని వారు నిర్ణయించుకున్నారు. మాస్కు లేకుండా గ్రామంలోకి ఎవరూ రాకుండా  ఉండడానికి పంచాయతీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మాస్క్‌ లేకుండా కూరగాయలు లేదా ఇతర సామగ్రి విక్రయించడానికి అనుమతివ్వబోమని తీర్మానించారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా..

 కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో ముందు జాగ్రత్త చర్యగా పలు నిర్ణయాలు తీసుకున్నాం. స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించుకు న్నాం. అన్ని దుకాణసముదాయాలను నిర్దేశించిన సమయంలోనే తెరిచి ఉంచాలని నిర్ణయిం చాం.  ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తాం. 

-తునికి వేణు, సర్పంచ్‌ 


logo