బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jun 15, 2020 , 02:28:32

ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపడదాం!

ప్రతి నీటిబొట్టునూ  ఒడిసిపడదాం!

  • lపంట పొలాలకు మళ్లించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
  • lబాల్కొండ నియోజకవర్గంలో  చెక్‌డ్యామ్‌లతో 33 గ్రామాలకు మేలు 
  • lమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 
  • lపలు మండలాల్లో పర్యటన

వేల్పూర్‌/మోర్తాడ్‌/ఏర్గట్ల: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి పంట పొలాలకు అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్‌, రోడ్లు, భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. వేల్పూర్‌ మండలంలోని వెంకటాపూర్‌, కుకునూర్‌ పెద్దవాగులల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. పెద్దవాగులో ప్రభుత్వం నూతనంగా నాలుగు చెక్‌డ్యామ్‌లను మంజూరుచేసిన నేపథ్యం లో అధికారులు, స్థానిక రైతులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియో జకవర్గంలోని వాగులకు పూర్వవైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ సహకారంతో కృషి చేస్తున్నానని తెలిపారు. కప్పల వాగు,పెద్దవాగులో 10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ఒకేసారి నిధులు మంజూరు చేశారన్నారు. వాటి నిర్మాణాలు పూర్తయితే మళ్లీ వాగులకు పూర్వవైభవం వస్తుందని, వాగుల్లో నిండుగా నీరు ప్రవహించే దృశ్యాన్ని తాను మళ్లీ హెలికాప్టర్‌ ద్వారా చూడడమే తన ఆశయమన్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు పూర్తయితే వాగు కు ఇరువైపులా ఉన్న 33 గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం మోర్తాడ్‌ మండలంలోని పాలెం -ధర్మోరా గ్రామాల మధ్య పెద్దవాగుపై రూ.8.90 కోట్లతో కొనసాగుతున్న చెక్‌డ్యాం కమ్‌ కాజ్‌వే పనులను మంత్రి పరిశీలించారు. కరోనా నేపథ్యంలో నిలిచిన పనులను వేగంగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. పెద్దవాగులోకి నీళ్లు వచ్చేలోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సుంకెట్‌ పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణం కోసం అధికారులు గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. 

ఏర్గట్లలో..

ఏర్గట్ల మండలంలోని తొర్తి, మెండోరా మండలం వెంచిర్యాల్‌ గ్రామల మధ్య ఉన్న పెద్దవాగుపై రూ.4.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రం ఏర్గట్ల, మండలంలోని తాళ్ల రాంపూర్‌ గ్రామాల మధ్య ఉన్న గుట్ట వద్ద  చెక్‌డ్యామ్‌కు  గండి పడడంతో మంత్రి అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం అటవీ, ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడుతూ.. చెక్‌డ్యాం గండితో కలిగిన నష్టం వివరాలను తనకు అందజేయాలని సూచించారు. మంత్రి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన్‌ డీఈ భాను ప్రకాశ్‌, ఈఈ ఆత్మారాం, జేఈ ప్రవీణ్‌, తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, ఎంపీపీలు భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్‌ఎంపీపీ బోదపల్లి సురేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నాగధర్‌, మోతె సొసైటీ చైర్మన్‌ రాజేశ్వర్‌, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నరెడ్డి, వెంకటాపూర్‌ సర్పంచ్‌ మహేశ్‌,సామ మహిపాల్‌, రాజశేఖర్‌గౌడ్‌, మధు,రవి ఉన్నారు.


logo