మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jun 13, 2020 , 02:17:08

మరోసారి ‘సెరో’ సర్వే

మరోసారి ‘సెరో’ సర్వే

n సామాజిక వ్యాప్తిపై ఐసీఎంఆర్‌ రెండో దశ చర్యలు

n కామారెడ్డి జిల్లాలో మరోసారి ర్యాండమ్‌ టెస్టులు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశంలో కరోనా మహమ్మారిని అంతం చేసే ప్రయత్నాలు వేగవంతం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఐసీఎంఆర్‌ ప్రత్యేక విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నది.  కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తికి చేరుకుం దా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు మే నెలలో నిర్వహించిన టెస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంచనాకు వచ్చాయి. ఇప్పటి వర కు ఉన్నటువంటి అధ్యయనాల ప్రకారం సామాజిక వ్యాప్తి అనేది ఎక్కడా కనిపించలేదు. తెలంగా ణ రాష్ట్రంలో కామారెడ్డి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో చేపట్టిన సెరో సర్వేలో కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి సంఖ్య స్వల్పంగానే బయట పడిం ది. కామారెడ్డి జిల్లాలో 400 మందికి నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లుగా నిర్ధారణ అయ్యింది. మిగిలిన వారందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఐసీఎంఆర్‌ నిర్వహించిన ర్యాండమ్‌ టెస్టు ఫలితాలు మొదటి దఫాలో ఆశాజనకంగానే వచ్చినప్పటికీ మరోదఫా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర సర్కా రు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం వైరస్‌ త్వరగా విస్తరిస్తుండడంతో రెండో విడుత సెరో సర్వే ఫలితాలపై అందరిలోనూఆందోళన మొదలవుతున్నది.కా మారెడ్డిలో మరో విడుత ర్యాండమ్‌ టెస్టులను జూన్‌ మూడోవారంలో ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఐసీఎంఆర్‌ హెచ్చరికలు...

కరోనా సామూహిక వ్యాప్తి దశకు కచ్చితంగా చేరుకోలేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది.దేశంలో 83 జిల్లా ల్లో చేపట్టిన సెరో సర్వేను రెండు దశల్లో చేపట్టినట్లు వె ల్లడించింది. సర్వే తొలిదశ పూర్తయ్యింద ని.. రెండో దశ పలు ప్రాంతాల్లో కొనసాగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ మూడోవారంలో ప్రా రంభించనున్నట్లు తెలుస్తున్నది. సర్వే పూర్తి చేసిన జిల్లాల్లో చాలా తక్కువ మందికి సార్స్‌ కోవ్‌- 2 లక్షణాలు ఉన్నట్లుగా తేలిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కంటైన్మెంట్‌ జోన్లలో వైరస్‌ ప్రభావం అధికంగా ఉండగా... ఈ ప్రాంతాల్లో కొద్దిమంది ఏకంగా వైరస్‌ ప్రభావానికి గురై ఆ తర్వాత కోలుకున్నట్లుగానూ ఐసీఎంఆర్‌ ర్యాండ మ్‌ పరీక్షల్లో తేలింది. మున్ముందు కరోనా వ్యాప్తి పెరిగి ఎక్కువ మొత్తంలో ప్రజలు వైరస్‌ ప్రభావానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని ఐసీఎంఆర్‌  హెచ్చరించిం ది. కరోనా వైరస్‌ నుంచి బయట పడాలంటే ప్రజ లు స్వీయ రక్షణ చర్యలు తప్పక పాటించాల్సిందిగా ఐసీఎంఆర్‌ పేర్కొంది. కామారెడ్డి 22 మండలాలుండగా మే 15, 16 తేదీల్లో జరిగిన సెరో సర్వేలో 10 మండలాలను కవర్‌ చేశారు. ఇప్పుడు అవే గ్రామాల్లో రక్త నమూనాలు సేకరిస్తారు. శరీరంలో ఉన్న యాంటిబాడీల మోతాదును తెలుసుకోవడం కోసమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తంలోని సీరంను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నందున దీన్ని శాస్త్రీయ భాషలో సెరో సర్వేగా పిలుస్తున్నారు. దీని ద్వారా గతంలో వైరస్‌ సోకి ఆ తర్వాత కోలుకున్న వారితో పాటు వైరస్‌ లక్షణాలు లేని వారిని కూడా సులభంగా గుర్తించే వెసులుబాటు ఉంది.

పకడ్బందీగా పరీక్షలు...

ఐసీఎంఆర్‌ బృందాలు కామారెడ్డిలో మే 15,16 తేదీల్లో పర్యటించాయి. ర్యాండమ్‌ టెస్టుల్లో భాగం గా సామాన్య ప్రజల నుంచి రక్త నమూనాలు తీసుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 10 క్లస్టర్ల నుంచి 400 మందిని ర్యాండమ్‌గా కలిసి వివరాలు సేకరించారు. జాతీయ పోషకాహార సంస్థ నిపుణులతో కలిసి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కో క్లస్టర్‌ను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 40 మందికి పరీక్షలు చేశారు. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు వాటిని చెన్నైలోని క్షయ పరిశోధన సంస్థలో పరిశోధన జరిపారు. కామారెడ్డి పట్టణం, తా డ్వా యి, ఎల్లారెడ్డి, భిక్కనూర్‌, రాజంపేట, మాచారెడ్డి,  నాగిరెడ్డిపేట, గాంధారి, జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద మండలాల్లో  బృందాలు పర్యటించి  18 ఏండ్లు నిండిన, 70 ఏండ్లు పైబడిన వారి నుంచి రక్త న మూనాలు సేకరించారు. వీరిలో రోగ నిరోధక శక్తి సామర్థ్యాలను విశ్లేషించారు.  మనకు తెలియకుండానే మన శరీరంలోకి చిన్నపాటి ఇన్‌ఫెక్షన్లు వచ్చి చేరతాయి. అలాంటివి ఏమైనా మానవ శరీరంలో కి ప్రవేశించాయా? అవి కరోనాకు సంబంధించిన వా? అనేవి ఈ పరీక్షల్లో తేల్చారు. మరోవైపు ప్రజ ల్లో రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో అంచనాకు రావడానికి సెరో సర్వే ఉపయోగపడనుంది.

ఆర్మూర్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

ఆర్మూర్‌ : ఆర్మూర్‌లో శుక్రవారం మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. బుధవారం పట్టణంలో తొలికేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తు తం ఆయన తల్లికి  సైతం కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె వయస్సు 65 సంవత్సరాలు ఉంటుందని ఆరోగ్య శాఖ, మున్సిపల్‌ అధికారులు తెలిపారు.  ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌, దేగాం ప్రత్యేకాధికారి భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం మున్సిపల్‌, పోలీసు, ఆరోగ్యశాఖల అధికారులు కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన ఏరియాలో తిరుగుతూ కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ నెల మూడో వారంలో టెస్టులు

కొవిడ్‌-19 సామాజిక వ్యాప్తి పరిశీలనలో భాగంగా మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ర్యాండమ్‌ టెస్టులు చేయబోతున్నాం. కామారెడ్డి జిల్లాలో తొలి విడుత ప్రక్రియ మాదిరిగా అవే గ్రామాల్లో పరీక్షలు ఉంటాయి. రెండో విడుత పరీక్షల ఫలితాల అనంతరం ఐసీఎంఆర్‌ కేంద్రానికి నివేదిక అందించి అప్రమత్తం చేస్తుంది. తొలి విడుత ర్యాండమ్‌ టెస్టులకు ప్రజలంతా సంపూర్ణంగా సహకరించారు. ఇప్పుడూ అదే రీతిలో సహకరిస్తారని ఆశిస్తున్నాం.

-డాక్టర్‌ లక్ష్మయ్య, సీనియర్‌ శాస్త్రవేత్త, ఎన్‌ఐఎన్‌logo