శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jun 10, 2020 , 03:42:30

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ మైనార్టీ నాయకుడు

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ మైనార్టీ నాయకుడు

నందిపేట్‌ : టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు కొనసాగుతున్నది. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌కు చెందిన బీజేపీ మైనార్టీ నాయకుడు అక్బర్‌ మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. ఆయన ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా,  గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించా రు. నందిపేట్‌కు చెందిన ముస్లిం యువజన సంఘ సభ్యులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్య క్రమంలో ఇమ్రాన్‌, యాకూబ్‌, అక్బర్‌, శారు పాల్గొన్నారు.