శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jun 10, 2020 , 03:39:53

అభివృద్ధి పనుల పరిశీలన

అభివృద్ధి పనుల పరిశీలన

చందూర్‌/మోర్తాడ్‌/నందిపేట్‌/మాక్లూర్‌/బోధన్‌రూరల్‌ /నవీపేట: చందూర్‌ మండల కేంద్రంతో పాటు కారేగాం, లక్ష్మాపూర్‌ గ్రామాలను జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్‌ జయసుధ మంగళవారం సందర్శించారు. నిర్మాణంలో ఉన్న డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలతోపాటు నర్సరీలు, పారిశుద్ధ్య పనులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేం ద్రాలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చేపట్టిన కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. గ్రామంలో ఖాళీ ప్లాట్లలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, ఎంపీ వో తారాచంద్‌, ఏపీవో దేవీసింగ్‌, చందూర్‌, కారేగాం, లక్ష్మాపూర్‌ గ్రామ కార్యదర్శులు సాయిలు, మహ్మద్‌ అలీ, సర్పంచులు సాయారెడ్డి, దేవీసింగ్‌, సత్యనారాయణ, రియాజ్‌ పాల్గొన్నారు. మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌లో అభివృద్ధి పనులను మండల ప్రత్యేకాధికారి, హార్టికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నర్సింగ్‌దాస్‌ పరిశీలించారు. సర్పంచ్‌ గడ్డం చిన్నారెడ్డితో కలిసి గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నందిపేట్‌లో నిర్మాణంలో ఉన్న డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్లను ఈనెల 30 లోగా పూర్తి చేయాలని ఎంపీడీవో నాగవర్ధన్‌ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బోధన్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీడీవో బానోత్‌ సుదర్శన్‌ నాయక్‌ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాక్లూర్‌ మండలంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యా ర్డులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో సక్రియానాయక్‌ సర్పంచులకు సూచించారు. నవీపేటలోని  మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో ఎంపీడీవో సయ్యద్‌ సాజిద్‌అలీ సమావేశం నిర్వహించా రు. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.