శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jun 06, 2020 , 02:09:23

టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు

టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు

బాన్సువాడ : మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తగిలెపల్లి, జాకో రా గ్రామాలకు చెందిన 500 మంది కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల కాలంలో చేయని అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం కేవలం ఆరేండ్లలో చేసి చూపించిందన్నారు.  ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరువేర్చుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో వర్ని కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు , తగిలెపల్లి ఎంపీటీసీ బక్క నారాయణ, జాకోరా విండో మాజీ అధ్యక్షుడు, ఎంపీటీసీ ఎండుగుల సాయిలుతోపాటు కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిరి, కార్యదర్శి గోపాల్‌ , జడ్పీటీసీ హరిదాస్‌, నాయకులు మేక బుజ్జి, ఎంపీపీ మేక వీర్రాజు, సింగిల్‌ విండో అధ్యక్షుడు సాయిబాబు,సర్పంచు ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నానిబాబు ఉన్నారు.

ఎమ్మెల్యే షిండే సమక్షంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల చేరిక

బిచ్కుంద:  పిట్లం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌), పిట్లం-(1) ఎంపీటీసీ స్రవంతిబాబు, పిట్లం-(2) ఎంపీటీసీ సుజాత, పోతిరెడ్డిపల్లి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు భూంరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే హన్మంత్‌షిండే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిచ్కుం ద టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పిట్లం మండల అధ్యక్షుడు రమేశ్‌, ఏఎంసీ చైర్మ న్‌ సుధాకర్‌రావు, మాజీ జడ్పీటీసీలు  రాములు, మురళీగౌడ్‌ పాల్గొన్నారు. 


logo