ఆదివారం 12 జూలై 2020
Nizamabad - Jun 04, 2020 , 02:12:39

పూల బాట

పూల బాట

ప్రకృతి అనే కాన్వాస్‌పై అందమైన పెయింటింగ్‌ వేసినట్లు.. విరబూసిన రంగు రంగుల పూలు రమణీయంగా.. మనసుకు హత్తుకునేలా.. కనువిందు చేస్తున్నాయి. పిల్ల గాలికి ఒక్కొక్కటిగా రాలుతున్న పూలు.. బాటసారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వేసవిలో చెట్ల ఆకులు రాలిపోవడం సాధారణమే అయినా ఇందుకు భిన్నంగా గుల్‌మోహర్‌ చెట్లు విచ్చుకున్న ఎర్రని పూలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా పరుచుకొని ప్రకృతికి వన్నె తెస్తున్నాయి. స్వాగత తోరణంలా అల్లుకొని ఆహ్వానం పలుకుతున్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఉగ్రవాయి అనాథాశ్రమం నుంచి కట్టమైసమ్మ, ఉగ్రవాయి గ్రామ శివారు వరకు, కోటగిరి మండల కేంద్రానికి వెళ్లే దారిలో ఉన్న గుల్‌మోహర్‌ చెట్లను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించి పోతున్నారు.

-కామారెడ్డిరూరల్‌ / కోటగిరి 


logo