గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jun 03, 2020 , 02:23:34

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

హాజరుకానున్న స్పీకర్‌ పోచారం, మంత్రి 

వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

నిజామాబాద్‌ సిటీ:  జడ్పీ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, జడ్పీ సీఈవో, జిల్లా అధికారులు పాల్గొననున్నారు.  సమావేశానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది అక్టోబర్‌ 25న సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ఎనిమిది నెలల తర్వాత మరోసారి నిర్వహిస్తున్నారు. సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ శాఖ, వానకాలం సీజన్‌కు నిర్దేశించిన యాక్షన్‌ ప్లాన్‌, కావాల్సిన ఎరువులు, విత్తనాలు, సీజనల్‌ వ్యాధులు, ఇతర శాఖలకు సంబంధించి  చర్చించే అవకాశం ఉంది.


logo