శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jun 03, 2020 , 02:18:51

బంగారు తెలంగాణే లక్ష్యం!

బంగారు తెలంగాణే లక్ష్యం!

ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పాలన 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ అద్భుతం

దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి

వేముల ప్రశాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బంగారు తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేము ల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లాలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. గతానికి భిన్నంగా ఈసారి కలెక్టరేట్‌ ప్రాం గణంలోనే అధికారికంగా వేడుకలకు ఏర్పాట్లు చేయగా, అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే జెండా వం దనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌ రావు, వీజీగౌడ్‌, ఆకుల లలిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, డీసీసీబీ చైర్మన్‌ పో చారం భాస్కర్‌ రెడ్డి, మేయర్‌ నీతూ కిరణ్‌తో కలిసి  మం త్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఉద యం 9గంటలకు జాతీయ జెండాను ఎగుర వేశారు. అం తకు ముందు వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి వేముల ఘనంగా నివాళ్లు అర్పించారు. జాతీ య పతాకావిష్కరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ నిరంతర పోరా ట ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్నారు. సమైక్యపాలకుల నుంచి విముక్తి పొంది ఆరేండ్లుగా యావత్‌ తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నదని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగుతున్నదన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు దేనికోసం గోస పడ్డారో, ఏం కావాలనుకున్నారో అవన్నీ స్వరాష్ట్రంలో ఒక్కొక్కటీ పరిష్కారమవుతున్నాయని తెలిపారు. రైతులు, పేదలను రెండు కళ్లుగా భావించి కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకం భారతదేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోందన్నారు. అలాగే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదని తెలిపారు. పంట పెట్టుబడికి రైతుల గోసను అర్థం చేసుకున్న కేసీఆర్‌ ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10వేలు అందిస్తున్నారన్నారు.

రైతుబంధు పథకం దేశంలో అందరి దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా వెలుగొందుతుందన్నారు. తెలంగాణ అంటే పిలవని సందర్భం నుంచి, తెలంగాణ పదం ఉచ్ఛరించాలంటే భయపడే నేపథ్యం నుంచి ఆరేండ్ల కాలంలో నెంబర్‌వన్‌ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్‌ స్కీంగా రూపుదిద్దుకోవడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని, మరింతగా ప్రజ్వరిల్లాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని మంత్రి  ఆకాంక్షించారు. కేసీఆర్‌ ఆకాంక్షిస్తోన్న బంగారు తెలంగాణ ఆవిష్కృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో రెడ్కో చైర్మన్‌ ఎస్‌ఏ అలీం, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు ఏఎస్‌ పోశెట్టి, డాక్టర్‌ బాపురెడ్డి, కార్పొరేటర్లు, నుడా డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.


logo