సోమవారం 13 జూలై 2020
Nizamabad - May 31, 2020 , 03:42:08

లాక్‌డౌన్‌తో మహారాష్ట్రలో చిక్కుకున్న జిల్లా వాసులు

లాక్‌డౌన్‌తో  మహారాష్ట్రలో చిక్కుకున్న జిల్లా వాసులు

  • శామిక రైలులో నిజామాబాద్‌ జిల్లాకు చేరుకున్న 214 మంది
  • ముందస్తు ఏర్పాట్లు చేసిన వైద్యాధికారులు
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. హోం క్వారంటైన్‌ స్టాంపింగ్‌ 

నిజామాబాద్‌ సిటీ : లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలో చిక్కుకుపోయిన జిల్లావాసులు, వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ముంబై నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌ వాసులను స్వస్థలాలకు తరలించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరిన శ్రామిక రైలు శనివారం ముధ్యాహ్నం 2.25 నిమిషాలకు నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నది. జిల్లాకు 214 మంది చేరుకున్నారు. జిల్లా వైద్యాధికారులు నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇక్కడికి చేరుకున్న ప్రయాణికుల పూర్తి వివరాలు నమోదు చేసుకొని, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. అందరికీ హోం క్వారంటైన్‌ స్టాంపింగ్‌ వేసి పంపించారు. అనంతరం నిజామాబాద్‌ నుంచి బయల్దేరిన రైలు ఆర్మూర్‌, మెట్‌పల్లి, కోరుట్ల మీదుగా కరీంనగర్‌కు చేరుకున్నది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ పాటిల్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్‌, రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ రవి తదితరులు పర్యవేక్షించారు. రైల్వేస్టేషన్‌లోకి బయటివారిని అనుమతించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు బందోబస్తును పర్యవేక్షించారు. 


logo