ఆదివారం 12 జూలై 2020
Nizamabad - May 29, 2020 , 23:54:14

ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామంటూ జోరుగా తీర్మానాలు

ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామంటూ జోరుగా తీర్మానాలు

  • ఏకతాటిపైకి పల్లెలు
  • సోంపూర్‌ సదస్సుకు హాజరైన స్పీకర్‌ పోచారం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అన్నదాతలు మద్దతుగా నిలుస్తున్నారు. నియంత్రిత పంటల సాగులో భాగంగా ప్రభుత్వం సూచించిన మేరకే ముందుకు సాగుతామంటూ తీర్మానాలు చేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే ప్రతిన బూనుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో పలు గ్రామాల రైతులు తీర్మానాలు చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి రైతులు అవగాహన సదస్సులో తీర్మానం చేశారు. బీబీపేట మండలం యాడారం, శివారు రాంరెడ్డిపల్లి గ్రామాల్లోని రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తామని తీర్మానం చేశారు.  నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని బర్దీపూర్‌, దూస్‌గాం, నాకాతండా, బీబీపూర్‌ తండా, దేవపల్లి, యానంపల్లి తండా, ధర్మారం, సాంపల్లి తండా, మెంట్రాజ్‌పల్లి గ్రామాల్లో సన్నరకాలనే సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.  జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్‌ రైతులు పంటలు చేస్తామంటూ ముక్త కంఠంతో తెలిపారు. ధర్పల్లి మం డలం వాడి గ్రామ రై తులు లాభసాటి పంటలే వేస్తామంటూ ప్రతిన బూనారు. మెండోరా గ్రామ రైతులు తీర్మానించి పత్రాన్ని అధికారులకు అందజేశారు.  భీమ్‌గల్‌ మండలం సికింద్రాపూర్‌, బాచన్‌పల్లి, కారేపల్లి, దేవన్‌పల్లి, సుదర్శన్‌ నగర్‌, జాగిర్యాల గ్రామాల రైతు లు తీర్మానాలు చేశారు.  మోర్తాడ్‌ మండలం దోన్‌పాల్‌, శెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లో  రైతులు సన్నరకం వరి, సోయా పంటలు పండిస్తామని తీర్మానాలు చేసి కాపీలను అధికారులకు అందించారు.


logo