ఆదివారం 12 జూలై 2020
Nizamabad - May 29, 2020 , 23:43:31

ఎంపీ అర్వింద్‌ విద్యార్హతపై చెలరేగుతున్న దుమారం

ఎంపీ అర్వింద్‌ విద్యార్హతపై చెలరేగుతున్న దుమారం

  • ఎంపీ అర్వింద్‌ విద్యార్హత సర్టిఫికెట్లపై చెలరేగుతున్న దుమారం
  • కేంద్ర ఎన్నికల సంఘానికి ఓయూ జేఏసీ నేత క్రిశాంక్‌ ఫిర్యాదు
  • అఫిడవిట్లో పొందుపర్చిన వివరాలు తప్పు అని ఆరోపణ 
  • రెండు నెలలవుతున్నా సమాధానం చెప్పని బీజేపీ ఎంపీ.. 
  • జనార్దన్‌ రాయ్‌నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ ప్రకటనతో అయోమయం
  • ధర్మపురీ..ఇది ధర్మమేనా!

పసుపు బోర్డు విషయంలో పూటకో మాట మారుస్తున్న ఎంపీ అర్వింద్‌..

విద్యార్హత విషయంలో తప్పుడు సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై హైదరాబాద్‌లోని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్‌ గోయల్‌కు టీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తున్నది. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందే  రాజస్థాన్‌లోని డీమ్డ్‌ యూనివర్సిటీలో ఎంఏ(పొలిటికల్‌ సైన్స్‌) పూర్తి చేసినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ధర్మపురి అర్వింద్‌ పేరుతో తమవద్ద ఎవరూ చదువుకోలేదంటూ యూనివర్సిటీ ధ్రువీకరించడంతో ఎంపీ విద్యార్హతపై వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై కోర్టుకు సైతం వెళ్లనున్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప సుపు బోర్డు తెస్తానంటూ రైతులకు ఇచ్చిన హా మీని తుంగలో తొక్కిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యవహారంలో మరో కీలకమై న అంశం వెలుగు చూసింది. విద్యార్హత విషయంలో తప్పుడు సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్‌లోని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్‌ గోయల్‌కు టీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ గురువారం ఫిర్యా దు చేయడంతో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లా ల్లో కలకలం సృష్టిస్తున్నది. పీజీ కోర్సు పూర్తి చేసినట్లుగా చెబుతున్న రాజస్థాన్‌లోని డీమ్డ్‌ యూనివర్సిటీలో ధర్మపురి అర్వింద్‌ పేరుతో ఎవరూ చ దువుకోలేరంటూ ధ్రువీకరణ పత్రం వెలుగు చూడడంతో ఎంపీ విద్యార్హత వ్యవహారంపై అ నుమానాలు బలపడుతున్నాయి.సాధారణ ఎన్నికలకు ముందే ఎంఏ(పొలిటికల్‌ సైన్స్‌) పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ కోర్సు డిస్టెన్స్‌ ఎడ్యుకేషనా? రెగ్యులర్‌ కోర్సా? అన్నదీ అందులో స్పష్టత లేకుండా పో యింది. ఆధారాలతో సహా ఈసీఐకి ఫిర్యాదు వెళ్లడంతో అర్వింద్‌ అనుచరుల్లో గుబులు మొదలైంది.

అసలు కథా ఇదీ...

రాజస్థాన్‌లోని జనార్దన్‌ రాయ్‌నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ పేరుతో దేశ వ్యాప్తంగా నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల గోల్‌మాల్‌ నడుస్తున్నది. విద్యాసంస్థ మెట్లు ఎక్కకుండానే కొంత మంది కేటుగాళ్లను ఆశ్రయిస్తే ఏ కోర్సులోనైనా ఉన్నత విద్య అర్హతను సంపాదించొచ్చు. ఈ వ్యవహారంపై అనేక మంది మోసపోవడంతో పెద్ద ఎత్తున దు మారం చెలరేగుతున్నది.ఈ విద్యాసంస్థపై సీబీఐ విచారణ సైతం కొనసాగుతున్నది.అలాంటి విద్యాసంస్థ నుంచి 2018లో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ పొందానంటూ అఫిడవిట్‌లో పొందుపర్చడం విశేషం. ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఓయూ జేఏసీనేత క్రిశాంక్‌ కూపీలాగితే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ధర్మపురి అర్వింద్‌ పేరిట సర్టిఫికెట్‌ ఆఫ్‌ వెరిఫికేషన్‌కు జనార్దన్‌ రాయ్‌నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌లో రూ.1500 రుసుము చెల్లించగా వారిచ్చిన సమాధానం కంగుతినేలా చేసిందని క్రిశాంక్‌ చెబుతున్నారు. ధర్మపురి అర్వింద్‌ తండ్రి ధర్మపురి శ్రీనివాస్‌ వివరాలతో ఏ ఒక్కరూ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సును తమ వద్ద చదవలేదంటూ జనార్దన్‌ రాయ్‌నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ నుంచి అధికారిక సమాచారం వెల్లడి కావడంతో ఎంపీ విద్యార్హత వ్యవహారంపై సమగ్ర విచారణచేసి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌ సీఈవోకు ఫిర్యాదు చేశారు.  

అర్వింద్‌ ఏం చెప్పారంటే..

2018, మార్చి 31 నాటి యూట్యూ బ్‌ ఇంటర్వ్యూలో ధర్మపురి అర్వింద్‌  ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘బీకాం ఫిజిక్స్‌' పే రిట  ఖ్యాతికెక్కిన ఓ ఛానల్‌ ప్రతినిధితో జరిపిన చర్చలో ఉన్నత విద్యాభ్యాసంపై ఎలాం టి ప్రకటన చేయలేదు. మీ ఎడ్యుకేషన్‌ ఎక్క డ జరిగింది. అసలు మీరు ఎంత వరకు చదువుకున్నారు? అనే ప్రశ్నకు హైదర్‌గూడలోని సెయింట్‌పాల్స్‌ హై స్కూ ల్‌లో 10వ తరగతి వరకు, సెయింట్‌ మేరీస్‌లో ఇంటర్‌ ఎంపీసీ చదువుకున్నట్లుగా ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. వెస్లీ కాలేజ్‌లో డిగ్రీ డిస్‌కంటిన్యూ అయినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రైవేటుగా పరీక్షలు రాసి 2000లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లుగా వివరించారు. డిగ్రీలో ఏం చేశారన్న ప్రశ్నకు  బీకాం డిస్‌కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్లీ బీఏలో పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హిస్టరీ పూర్తి చేసినట్లుగా అర్వింద్‌ వివరించారు. బీకాం నుంచి బీఏకు ఎందుకు మారారు? అనే ప్రశ్నకు వెస్లీలో బీఏనే తీసుకుందామనుకున్నాను. అప్పట్లో ఆర్ట్స్‌ లేకుండె. ఇప్పట్లో ఉందో లేదో తెలియదు అంటూ అస్పష్టంగా సమాధానం ఇచ్చారు. ‘నాన్న గారు చెప్పలేదా? పైచదువులు చదవమని?’ అన్న  ప్రశ్నకు అర్వింద్‌ నుంచి సమాధానం రాలేదు. ఈ ఇంటర్వ్యూ 2గంటల 38నిమిషాల నిడివిలో 2గంటల 20 నిమిషాల వద్ద చదువుపై చర్చ కొనసాగింది. సరిగ్గా ఇంటర్వ్యూ ప్రసారమైన ఏడాది సమయానికి ఎన్నికల అఫిడవిట్‌లో పీజీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుకున్నట్లుగా పేర్కొనడం విశేషం.

వెబ్‌సైట్‌ ఫలితాలు బూటకం..

ఎంపీ అర్వింద్‌ విద్యార్హత సర్టిఫికెట్లు ఫేక్‌. వీటికి సంబంధించిన ఆధారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి స మర్పించాం. ఎంపీపై క్రిమినల్‌ కేసులు పెట్టడంతో పాటు లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరాం. ఇక్కడ వదిలేసి రాజస్థాన్‌లో ఎంఏ చదవాల్సి వచ్చిందో ఎంపీ సమాధానం ఇవ్వడం లేదు. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో తాను పాస్‌ అయినట్లుగా చూపుతున్న వెబ్‌సైట్‌ సైతం బోగస్‌ది. జనార్దన్‌ రాయ్‌నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ వారు యూజీసీకి సమర్పించిన వెబ్‌సైట్‌కు ఎంపీ అర్వింద్‌ చూపుతున్న వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. ఫేక్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూపి ప్రజలను మభ్యపెడుతూ తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఎంపీ విద్యార్హత పై సమగ్ర విచారణకు త్వరలోనే హైకోర్టును ఆశ్రయించబోతున్నాం.

- క్రిశాంక్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు


logo