గురువారం 28 మే 2020
Nizamabad - May 24, 2020 , 01:43:35

స్వరాష్ర్టాలకు పయనం

స్వరాష్ర్టాలకు పయనం

ఉమ్మడి జిల్లా నుంచి 513 మంది కూలీల తరలింపు

ప్రత్యేక బస్సుల్లో వివిధ రైల్వేస్టేషన్లకు చేరవేత

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో 

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ విధించగా ఇతర రాష్ర్టాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వలస కూలీలను స్వరాష్ర్టాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని వలస కూలీలను శనివారం స్వరాష్ర్టాలకు తరలించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 350 మంది, కామారెడ్డి నుంచి 163 మందిని ప్రత్యేక బస్సుల్లో తరలించారు. బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ తదితర మండలాల నుంచి కూలీలు నిజామాబాద్‌కు రాగా వీరి కోసం 40 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో వీరిని హైదరాబాద్‌కు తరలించారు. కామారెడ్డి నుంచి బిహార్‌కు 51 మంది, ఒడిశాకు 51 మంది, ఉత్తరప్రదేశ్‌కు 42 మంది, రాజస్థాన్‌కు 9 మంది, మహారాష్ట్రకు 8 మంది, జార్ఖండ్‌కు ఇద్దరు మొత్తం 163 మంది తరలివెళ్లారు. కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి పర్యవేక్షణలో కూలీలను కామారెడ్డి, సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లారు. 

-ఇందూరు / బోధన్‌ / విద్యానగర్‌ 

ఉమ్మడి జిల్లాలో చిక్కుకున్న పలు రాష్ర్టాలకు చెందిన కూలీలు శనివారం స్వగ్రామాలకు పయనమయ్యారు. చేతిలో పనిలేక, తిందామంటే తిండిలేక అలమటించిన వలస జీవులు దాతల చేయూతతో రోజులు వెళ్లదీశారు. ఒక పూట తింటే మరో పూట పస్తులుండాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం వలస కూలీలకు ఆశ్రయం కల్పించి కంటికి రెప్పలా కాపాడింది. కష్టకాలంలో కడుపులో పెట్టుకొని చూసుకున్న కూలీలను అధికారులు సాదరంగా సాగనంపారు.

మళ్లీ మా ఇంటికి వెళ్తామనుకోలేదు..

లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. చేతిలో పనిలేదు. తిందామంటే తిండిలేదు. మళ్లీ మా ఇంటికి వెళ్తామనుకోలేదు. ప్రభుత్వమే దగ్గరుండి మాకు అన్నీ సమకూర్చింది. ఇప్పుడు మమ్మల్ని ఇంటికి పంపడం సంతోషంగా ఉంది

- జనని, ఒడిశా


logo