శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 22, 2020 , 01:55:41

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

టీఆర్‌ఎస్‌లోకి  కొనసాగుతున్న వలసలు

కాంగ్రెస్‌, బీజేపీ నుంచి వరుస కట్టిన ప్రజాప్రతినిధులు

సీఎం జనరంజక పాలన చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు : మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 25వ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ సిరిగాద ధర్మపురి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ న్యామతాబాద్‌ శివచరణ్‌ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌ గుప్తా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలానికి చెందిన సావెల్‌ ఎంపీటీసీ పుప్పాల రాజు మంత్రి వేముల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమానికి నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. రైతులందరూ ఒకే పంటను వేయడం ద్వారా పంటను అమ్ముకునేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంద ని, అలాంటి పద్ధతికి స్వస్తి పలికి నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసుకోవాలని కోరారు. మార్కెట్‌లో డి మాండ్‌ ఉన్న పంటలు పండిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మెండోరా మండల అధ్యక్షుడు శేఖర్‌, ఎంపీపీ సుకన్య కమలాకర్‌, సావెల్‌ సర్పంచ్‌ నెళ్ల లింగన్న, నాయకులు పాల్గొన్నారు.


logo