బుధవారం 03 జూన్ 2020
Nizamabad - May 21, 2020 , 01:37:09

విత్తు సిద్ధం

విత్తు సిద్ధం

  • సన్నరకాల విత్తనోత్పత్తిని పెంచుతున్న విత్తనాభివృద్ధి సంస్థ 

  • రెండు లక్షల ఎకరాలకు సరిపడా వరి విత్తనాలు సిద్ధం 
  • కందులు, సోయా విత్తనోత్పత్తి పెంపు 
  • ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు
  • ప్రత్యామ్నాయ సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు 

తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగువిధానానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో విత్తనాభివృద్ధి సంస్థ అందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. బుధ, గురువారాల్లో కీలక సమావేశాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం, జిల్లాల వారీగా సాగు యాక్షన్‌ప్లాన్‌ను ప్రకటించనున్నది! ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనల మేరకు మారనున్న సాగు విధానాన్ని పరిగణలోకి తీసుకొని అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సీజన్‌లో జిల్లాలో 70శాతం సన్న, 30శాతం దొడ్డు రకాలు సాగుచేసేలా రైతాంగాన్ని ప్రోత్సహించనున్నట్లు సమాచారం. కంది, సోయా, పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేలా చర్యలు చేపట్టి, మక్కజొన్న విస్తీర్ణాన్ని తగ్గించనున్నట్లు తెలుస్తున్నది. సాగుయాక్షన్‌ప్లాన్‌ ఎలా ఉన్నా అవసరమైన విత్తనాలను రైతులకు అందజేసేందుకు సీడ్స్‌కార్పొరేషన్‌ సిద్ధంగా ఉంది.  

-నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ 

విత్తన భాండాగారంగా విలసిల్లుతున్న నిజామాబాద్‌ జిల్లాలో నియంత్రిత వ్యవసాయాన్ని వంద శాతం విజయవం తం చేసేందుకు యంత్రాంగం అన్ని చర్య లు తీసుకుంటున్నది. ఈ మేరకు వానకా లం సీజన్‌ యాక్షన్‌ ప్లాన్‌లో అధికారులు పూర్తిగా మార్పులు చేశారు. ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డిమాండ్‌, మార్కెటింగ్‌ ఉన్న పంటలను సాగుచేసేందుకు మ్యాపింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా బుధ, గురువారాల్లో కీలక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ సమావేశాల్లో యాక్షన్‌ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకొని ఏ జిల్లాలో ఏ పంటలు సాగుచేయాలో నిర్ణయిస్తారు.

నియంత్రిత సాగు దిశగా...

ప్రధానంగా వరి సాగును నియంత్రిస్తారు. ఈసారి 70 శాతం సన్నరకాలు, 30 శాతం దొడ్డు రకాలు సాగుచేసేలా రైతాంగాన్ని ప్రోత్సహించనున్నారు. కంది, సోయాబీన్‌, పత్తి పంటలు మరింతగా సాగుచేసే లా చర్యలు చేపడతారు. మ క్కజొన్న పంట సాగును భారీగా తగ్గించనున్నారు. ఈ మేర కు కావాల్సిన విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సి ద్ధం చే స్తున్నది. ప్రభుత్వ ఆలోచనల మేరకు మారుతున్న సాగు విధానాన్ని పరిగణలోకి తీసుకొని కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ఈ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలకు సరిపడా వరి విత్తనాలు సిద్ధం చేసింది. వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌లు)కు తరలించి పంపిణీ కోసం సిద్ధంగా ఉంచింది. దొడ్డు రకం వెరైటీలు (కేఎన్‌ఆర్‌ -118), (ఎంటీయూ-1010) దాదాపు 50 వేల ఎకరాల కోసం 12,500 క్వింటాళ్ల విత్తనాలను రెడీ చేసింది. బీపీటీ -5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) రకాలను 1,60,000 ఎకరాల కోసం సన్నరకాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కావాల్సిన వెరైటీలు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సోయాబీన్‌ సైతం 50 వేల ఎకరాల్లో సాగుకోసం విత్తనాలు సిద్ధం చేస్తున్నది. 23 వేల క్వింటాళ్ల విత్తనాన్ని శుద్ధిచేసి పంపింది. కందులు 300 క్వింటాళ్ల విత్తనాలు రెడీగా ఉంచింది. ఇంకా కావాల్సి వస్తే ‘వనపర్తి సీడ్స్‌ కార్పొరేషన్‌' నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 


సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు.. 

భూసారానికి తగ్గట్టు ఏ మండలంలో ఏ పంటలు సాగు చేయాలో వ్యవసాయశాఖ యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నది. సీడ్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 30 కేజీల విత్తనాల బ్యాగును రూ.750 సబ్సిడీ మీద పీఏసీఎస్‌ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వానకాలం సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో వరిని సాగుచేస్తారని తొలుత అంచనా వేశారు. ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని అమలు చేయనుండడంతో వరిసాగు 3లక్షల ఎకరాలకు పరిమితం కానున్నది. ఇందులోనూ మెజార్టీ సన్నరకాలే పండించనున్నారు. దొడ్డు రకం ధాన్యం ఈ సీజన్‌ నుంచే గణనీయంగా తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కందులు ఈసారి 15వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. పత్తి ఎక్కువగా సాగయ్యే జుక్కల్‌ నియోజకవర్గంతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ విస్తీర్ణాన్ని పెంచనున్నారు. నిజామాబాద్‌లోని సీడ్స్‌ కార్పొరేషన్‌ నుంచి వరి విత్తనాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకే కాకుండా ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్ర సీడ్‌ కార్పొరేషన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేస్తున్నారు. 

నాణ్యమైన విత్తనాలను అందిస్తూ 

రైతాంగ అభ్యున్నతికి పాటుపడుతున్నది నిజామాబాద్‌ శివారు సారంగపూర్‌లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ. ఈ వానకాలం సీజన్‌కు కావాల్సిన విత్తనాలను సంస్థ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలకు సరిపడా వరి విత్తనాలను వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌లు)కు సరఫరా చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం నియంత్రిత సాగును ప్రోత్సహిస్తుండడంతో ఆ మేరకు కావాల్సిన విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నది.  

అవసరమైన విత్తనాలు అందిస్తాం.. 

ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అవసరమైన విత్తనోత్పత్తిని చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో వానకాలం యాక్షన్‌ ప్లాన్‌పై స్పష్టమైన ప్రణాళిక రానున్నది. ఆ మేరకు అవసరమైన ప్రతి విత్తనాలను రైతులకు అందజేస్తాం. ఇప్పటి వరకు సన్నరకాలు, కందులు, సోయాబీన్‌ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్‌లకు పంపించాం. కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లాలో అవసరమైన పంటల విస్తీర్ణానికి కావాల్సిన విత్తనాలన్నీ అందజేసేందుకు సిద్ధం చేస్తున్నాం. 

-కె.విష్ణువర్ధన్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఆర్‌ఎం, నిజామాబాద్‌


logo