సోమవారం 01 జూన్ 2020
Nizamabad - May 20, 2020 , 02:50:31

లాక్‌డౌన్‌ వేళ ఉపాధి హామీ పనులకు..

 లాక్‌డౌన్‌ వేళ ఉపాధి హామీ పనులకు..

బీర్కూర్‌ : లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతుండడంతో ప్రతి ఒక్కరూ పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. కూలీలతోపాటు ఉన్నత విద్యావంతులూ పనులకు వెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం ‘ఉపాధి’ మార్గాన్ని ఎంచుకున్నారు. మొన్నటి వరకు వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సైతం ఉపాధి హామీ పనులకు వెళ్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పట్టణాలు, నగరాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామాలకు చేరుకున్నారు. రెండు నెలలుగా ఇండ్లకు పరిమితమైన వారికి పనులు లేక, కుటుంబ పోషణ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు వరంలా మారాయి. గతంలో తాము చేసిన పనులకు భిన్నంగా ఇప్పుడు కూలి పనులకు వెళ్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా విద్యార్థులు సైతం పనుల్లో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల ఊళ్లకు ఊళ్లే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాయి. ప్రస్తుతం వారికి చేతినిండా పని లభించడంతో కుటుంబ పోషణ సాఫీగా సాగుతున్నది.

కుటుంబ పోషణ కోసం.. 

కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎంతో దోహద పడుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీగా ఉంటే కుటుంబం గడిచే అవకాశం లేదు. తప్పనిసరై పనులకు వెళ్తున్నా.

- గైని సాయిలు, కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుడు, బీర్కూర్‌


logo