ఆదివారం 31 మే 2020
Nizamabad - May 20, 2020 , 02:47:42

టీఆర్‌ఎస్‌లోకి వలసల వరుస!

టీఆర్‌ఎస్‌లోకి వలసల వరుస!

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలానికి చెంది న కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యుడు గుల్లె రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రేండ్ల రవితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం హైదరాబాద్‌ లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షం లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ జనరంజక పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి సాగునీటి వెతలు తీర్చారన్నారు. 

రైతుకు మేలు చేసేలాసమగ్ర వ్యవసాయ ప్రణాళిక

రైతాంగానికి మేలు చేకూర్చేలా సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపకల్పనను ప్రభుత్వం చేపడుతున్నదని, నియంత్రిత విధానంలో పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఆలోచన చేస్తున్నారని, ఆయన చెప్పినట్లు రైతులు లాభసాటి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ధాన్యం, మక్కలు ఎక్కువ పండిస్తే రానున్న రోజుల్లో డిమాండ్‌ తగ్గి రైతులకు మద్దతు ధర దక్కక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలని, ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీటీసీ జక్కని మధు, సర్పంచ్‌ లావణ్య, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో  బీజేపీ ఎంపీటీసీలు..

మాక్లూర్‌: నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అమ్రాద్‌ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్‌ కోటగిరి లక్ష్మి , గొట్టుముక్కల ఎంపీటీసీ సత్యగంగు, ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి ఎంపీటీసీ  లినిత టీఆర్‌ఎస్‌లో చేరారు. గుంజిలి ఎంపీటీసీ సుజాత (కాంగ్రెస్‌) కూడా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు.  వీరు మంగళవారం హైదరాబాద్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీకి సరైన నాయకత్వం లేదని, పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అర్వింద్‌ రైతులను మోసం చేశాడని వారు ఆరోపించారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ రజనీశ్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

 విప్‌, ఎంపీ సమక్షంలో  కౌన్సిలర్‌, ఎంపీటీసీలు..

విద్యానగర్‌: కామారెడ్డి ప ట్టణంలోని 23వ వార్డు కౌ న్సిలర్‌ తేజపు మానస ప్రసాద్‌ (కాంగ్రెస్‌) మంగళవారం ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎం పీ బీబీపాటిల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోచేరారు. కామారెడ్డిలో గంపగోవర్ధన్‌ నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, టీఆర్‌ఎస్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, గెరిగంటి లక్ష్మీనారాయణ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు బుక్యా రాజు, అంజల్‌రెడ్డి పాల్గొన్నారు.

విప్‌ సమక్షంలో ఎంపీటీసీలు..

విద్యానగర్‌ (రామారెడ్డి)/దోమకొండ: రామారెడ్డి మండలం సింగరాయిపల్లి ఎంపీటీసీ  చంద్రునాయక్‌ (కాంగ్రెస్‌), దోమకొండ మండలం అంచనూర్‌ గ్రామానికి చెందిన ఎంపీటీసీ దోర్నాల లక్ష్మి (కాంగ్రెస్‌) ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి విప్‌ గులాబీ కండువా వేసి  పార్టీలోకి ఆహ్వానించారు.


logo