గురువారం 04 జూన్ 2020
Nizamabad - May 19, 2020 , 02:29:18

రైతును రాజును చేద్దాం!

రైతును రాజును చేద్దాం!

నియంత్రిత విధానంలో పంటలు పండించాలి 

ఆ దిశగా రైతాంగాన్ని సమాయత్తం చేయాలి

ఇష్టం వచ్చినట్లు పంటలేస్తే రైతుబంధు రాదని రైతులకు అవగాహన కల్పించండి 

డిమాండ్‌ ఉన్న పంటలు రైతులు పండించేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి

వీసీలో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం nపాల్గొన్న ఇరు జిల్లాల కలెక్టర్లు, రైతుబంధు ప్రతినిధులు

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ/కామారెడ్డి: నూతన వ్యవసాయ విధానం, వానకాలం సాగు సీజన్‌ గురించి కలెక్టర్లు, వ్యవసా య అధికారులు, రైతుబంధు సమన్వయ స మితి అధ్యక్షులు, సభ్యులతో సోమవారం సీ ఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి వీడియో కా న్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారి కి సీఎం దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు, రైతుబంధు సభ్యులు సమన్వయంతో పనిచేయాలని, రైతును రాజును చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి పంటలు సాగుచేస్తే మద్దతు ధర దక్కడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పాటు రైతుబంధు పథకం లబ్ధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా పంటబీమా కల్పిస్తున్నామని, రూ. 25 వేలలోపు పంట రుణాలు ఇటీవల మాఫీ చేశామని తెలిపారు. రూ. 35వేల కోట్ల తో పంటలు కొన్నామన్నారు. మన రాష్ట్రంలో ప్రధానంగా మూడు రకాల పంటలు పండుతున్నాయని, వరి 79 లక్షల ఎకరాలు, పత్తి 53 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 20 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు  లక్ష పైచిలుకు ఎకరా ల్లో సాగు చేస్తున్నారని, నియంత్రిత విధానంలో పంటలు వేయాలని సూచించారు. ఏ పంట వేస్తే లాభం ఉంటుందో చూసుకొని వేయాలని, డిమాండ్‌ లేని పంటలు వేయవద్దని, ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో వ్యవసాయశాఖ అధికారులు తెలియజేస్తారని, వారి సూచనల మేరకు రైతులు పంటలు వేయాలని, ఆ దిశగా అధికార యం త్రాంగం కృషిచేయాలని అన్నారు. ప్రతి జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించి, జిల్లా కలెక్టర్లు డిమాండ్‌ ఉండే పంటలు వేసేలా చూడాలని, ప్రభుత్వం సూచించిన పంటలు వేయనట్లయితే రైతుబంధు రాదన్న విషయం ప్రతి రైతుకూ తెలియజేయాలని ఆదేశించారు.

నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు: కామారెడ్డి కలెక్టర్‌

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ స్పందిసూ.. రైతుల సంక్షేమం కోసం జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామని, బాన్సువాడ ప్రాంతంలో నెల ముందు నా ట్లు వేస్తారని, ఇందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతేడాది వానకాలంలో 2,11,220 ఎకరాల్లో వరి వేశారని, ఇందులో 14శాతం మాత్రమే సన్నాలు సాగుచేశారని సీఎంకు వివరించారు. రా నున్న వర్షాకాలంలో  రైతులు 40శాతం వర కు సన్నాలు వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వానకాలంలో మొక్కజొన్న వేయవద్దని, దానికి బదులుగా కందులు వేయాలని, కందులకు మద్దతు ధర కల్పిస్తామనే విషయాన్ని రైతులకు వివరిస్తామని తెలిపారు. రైతులు ఎరువులను ముందే తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటామని, ఎరువు ల విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.  క్లస్టర్లలో యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతామని, జిల్లాలో ఉన్న వంద క్లస్టర్లకు గాను 55 క్లస్టర్లకు రైతు వేదిక భూమి గుర్తించామని, మిగతా క్లస్టర్లకు సంబంధించి రెండు రోజుల్లో రైతు వేదిక నిర్మాణ భూమిని సేకరిస్తామని కలెక్టర్‌ శరత్‌ సీఎంకు వివరించారు. జిల్లాలో 2.20 లక్షల మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఉన్నారని, వారి ద్వారా చెరువుల్లో పూడికతీత కల్పిస్తామని, రైతులకు విశ్వాసం, ధీమా కలిగించే కార్యక్రమాలను చురుగ్గా చేపడతామని తెలిపారు. వీసీలో ఇరు జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, శరత్‌, అధికారులు పాల్గొన్నారు.


logo