గురువారం 04 జూన్ 2020
Nizamabad - May 15, 2020 , 02:09:19

మూడు జిల్లాలు.. కరోనా ఫ్రీ

మూడు జిల్లాలు.. కరోనా ఫ్రీ

  • గాంధీ దవాఖానలో చికిత్స పొందిన వారంతా ఇండ్లకు చేరిక
  • నిజామాబాద్‌లో మిగిలింది ఒకే ఒక్కరు 

ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్‌ వచ్చిన వారిని తక్షణమే గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. కోలుకున్న వారిని  విడుతల వారీగా  డిశ్చార్జి చేస్తూ వచ్చారు.    దీంతో ఆదిలాబాద్‌, నిర్మల్‌ కరోనా ఫ్రీ జిల్లాలుగా మారాయి. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఒక్కరు మాత్రమే ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు కాగా ఇప్పటికే అందరూ డిశ్చార్జి అయ్యారు. 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: కరోనా పాజిటివ్‌ కేసులు నిజామాబాద్‌ జిల్లాలో పూర్తిగా త గ్గుముఖం పట్టాయి. 61 మంది వైరస్‌ బారి నపడి గాంధీకి తరలిన సందర్భంలో జిల్లాలో ప్ర మాద ఘంటికలు మోగాయి. ఆ తర్వాత నెల రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. 61 మందిలో రెండు, మూ డ్రోజులకు కొంత మంది చొప్పున నెగెటివ్‌ రిపోర్టులతో క్రమంగా అందరూ ఇంటిబాట పట్టారు. మొన్నటి వరకు ఐదు కేసులు ఉండగా గురువారం నలుగురు డిశ్చార్జి కావడంతో ఆ సం ఖ్య ఒకటికి చేరింది. ప్రస్తుతం ఒకరు మాత్రమే గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఈ తాజా పరిణామం జిల్లా ప్రజలకు ఊరట కలిగిస్తున్నది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో క్రమక్రమం గా రోజు వారీ కార్యకలాపాల్లో ముందస్తు జాగ్రత్తల నడుమ బిజీ అవుతూ వస్తున్న ప్రజలకు క రోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడం కొంత ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ నెల 29 వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో స డలింపుల ఆధారంగా రోజువారీ పనులు చేసుకుంటూ ప్రజలు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ కరోనాను దరి చేరకుండా చేయాలని భావిస్తున్నారు.

కామారెడ్డిలో.. 

కామారెడ్డి/నమస్తే తెలంగాణ: కామారెడ్డి జిల్లా కరోనా కేసు ల్లో జీరోకు చేరుకుంది.  45 రోజుల అనంతరం కొవిడ్‌ 19 నుంచి పూర్తిగా బయటపడింది. మార్చి 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో తొలి కేసు నమోదైంది. అనంతరం బాన్సువాడలో 11 కేసులు వెలుగు చూడడంతో కేసుల సంఖ్య 12కు చేరింది. ఏప్రిల్‌ 12న జిల్లాలో చివరి కరోనా కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న వారు కోలుకుంటూ ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేశారు. మే 13 నాటికి అందరూ డిశ్చార్జి కావడంతో  జిల్లాలో కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది.


logo