బుధవారం 27 మే 2020
Nizamabad - May 14, 2020 , 02:15:32

లాక్‌డౌన్‌లో పేదలను ఆదుకుంటూ..

లాక్‌డౌన్‌లో పేదలను ఆదుకుంటూ..

నమస్తే తెలంగాణ యంత్రాంగం : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా దాతలు ముందుకొస్తున్నారు. వారికి సరుకులు పంపిణీ చేయడంతోపాటు పలుచోట్ల అన్నదానం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆర్డీవో వినోద్‌కుమార్‌, ఉట్నూర్‌ మండలంలో పేదలకు దళిత్‌శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పోలీసు సర్కిల్‌ ఆధ్వర్యంలో ఎంపీపీ మోహిద్‌ సహకారంతో కడెం మండలంలోని ఆదివాసీలకు, ఖానాపూర్‌లోని పలువురు బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యే రేఖానాయక్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గంగాయిపేట్‌లో రిటైర్డ్‌ ఏఎస్పీ దేవీదాస్‌ సరుకుల ప్యాకెట్లను పేదలకు అందజేశారు. భైంసా చెక్‌పోస్టు వద్ద వలస కూలీలకు సేవాభారతి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి సరుకులు అందజేశారు. భిక్కనూరులో ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ ఆశ కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గాంధారిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మూడు వేల మాస్కులను అందజేశారు. బీబీపేట మండలం తుజాల్‌పూర్‌లో ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ సహకారంతో పేదలకు ప్రజాప్రతినిధులు సరుకులు అందజేశారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌ వీఆర్‌ఏ సురేందర్‌ పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ముప్కాల్‌లో హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు అంగన్‌వాడీ టీచర్‌ అమీనాబేగం భోజనం పెట్టారు. నవీపేట మండలం సిరన్‌పల్లిలో సర్పంచ్‌ సుధాకర్‌రావు ఇంటింటికీ తిరిగి మాస్కులు పంపిణీ చేశారు. 

సీఎం సహాయనిధికి చెక్కు అందజేత..

గాంధారి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలకు గాంధారి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు, పాలక మండలి సభ్యులు తమ వంతు చేయూతను అందించారు. ఈ మేరకు రూ.1,02,997 విలువైన చెక్కును ఏఎంసీ చైర్మన్‌ పెద్దబూరి సత్యం గాంధారిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌కు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు.  


logo