సోమవారం 01 జూన్ 2020
Nizamabad - May 14, 2020 , 02:15:34

ట్రాన్స్‌పోర్ట్టు యజమానులు సహకరించాలి

ట్రాన్స్‌పోర్ట్టు యజమానులు సహకరించాలి

  •  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌తో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నదని,  డ్రైవర్లు లేరన్న సాకుతో ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు లారీలు పంపకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం తరలింపునకు ట్రాన్స్‌పోర్టు యజమానులు సహకరించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లు ముగిసిన సెంటర్లలోని హమాలీలను అవసరం ఉన్న చోట వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం వరకు రైతులకు వరి ధాన్యానికి రూ. 287 కోట్లు, మక్కలకు రూ. 41 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 5.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. 351 కొనుగోలు కేంద్రాల ద్వారా  3.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, ఇందులో 3.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు పంపించామని ఆయన పేర్కొన్నారు.   


logo