శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 14, 2020 , 02:15:36

టార్గెట్‌ జీరో

టార్గెట్‌ జీరో

  • ‘జీరో’ కేసుల దిశగా ఇందూరు 
  • అష్ట దిగ్బంధనంతో  కట్డడి 

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ: మార్చి 30..ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసిన దినం. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్‌ నగరం ఉలిక్కిపడింది. నగరంలోని ఖిల్లా రోడ్డులో  ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు తేలడంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. కుటుంబ సభ్యులు 11మందిని మాక్లూర్‌లోని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. అర్ధరాత్రి వరకు అధికారులంతా ఈ పనిలో లీనమయ్యారు. ఆ వెంటనే మూడు కిలోమీటర్ల మేర ఆ పరిధిని బఫర్‌జోన్‌గా .. ఒక కి.మీ మేర కంటైన్మెంట్‌ జోన్‌గా కలెక్టర్‌ ప్రకటించా రు. ఆ తెల్లారి నుంచే ఇంటింటి సర్వే మొదలయ్యింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుతున్న ఇందూరులో కలకలం రేగింది.  ఆ తర్వాత కేసు ల సంఖ్య 61కు చేరింది. హైదరాబాద్‌ తర్వాత ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైంది నిజామాబాద్‌లోనే కావడంతో అందరి దృష్టి జిల్లా పై పడింది. తొలి కేసు నమోదైన సందర్భంలో అలర్ట్‌ అయి న జిల్లా యంత్రాంగం.. అదే స్ఫూర్తిని కొనసాగించింది. నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులను గుర్తిస్తూనే .. ప్రైమరీ కాంటాక్ట్‌పై ప్రధానంగా దృష్టికేంద్రీకరించింది. కమ్యూనిటీ కాంటాక్ట్‌కు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నది.కలెక్టర్‌ నారాయణరెడ్డి నేతృత్వం లో యంత్రాంగం పట్టు సడలకుండా కరోనాపై అలుపెరగని పోరు సల్పుతున్నది. హాట్‌స్పాట్లను కంటైన్మెంట్‌ క్లస్లర్లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 21 క్లస్టర్లను ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దారులూ మూసేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో యంత్రాంగం నిరంతర పర్యవేక్షణతో సత్ఫలితాలు వచ్చాయి. ఇందూరును సేఫ్‌ జోన్‌లోకి తీసుకెళ్లేందుకు జన సంచారాన్ని నియంత్రించింది. ప్రస్తుతం జిల్లాలో 5పాజిటివ్‌ కేసులు మాత్రమే మిగిలి ఉ న్నాయి. గ్రీన్‌జోన్‌ దిశగా అడుగులు వేస్తున్నది.

అష్ట దిగ్బంధంతో సేఫ్‌ జోన్‌లోకి... 

పొరుగు ఉన్న మహారా్రష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో యం త్రాంగం అప్రమత్తమయ్యిం ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుంచి వచ్చే రాకపోకలను పూర్తిగా నియంత్రించింది. సరిహద్దుల్లో కోటగిరి మండలం పోతంగల్‌, రెంజల్‌ మండలం కందకుర్తి, బోధన్‌ మండ లం సాలూరాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిం ది. పోలీస్‌, రెవెన్యూ, రవాణా శాఖలు సమన్వయం చేసుకుంటూ ఎవరినీ అక్కడి నుంచి ఇక్కడి రానీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సీపీ కార్త్తికేయ సరిహద్దును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఎత్తేసినా.. వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. 


logo