గురువారం 28 మే 2020
Nizamabad - May 12, 2020 , 01:56:40

సిబ్బందికి భోజనం పెట్టడం సంతృప్తినిచ్చింది

సిబ్బందికి భోజనం పెట్టడం సంతృప్తినిచ్చింది

  • నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా 

ఖలీల్‌వాడి : లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తించిన వివిధ శాఖల సిబ్బందికి 41 రోజుల పాటు ఆహారం అందించడం సంతృప్తినిచ్చిందని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొనసాగిన భోజన వితరణ ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని అర్వపల్లి పురుషోత్తంగుప్తా గార్డెన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య, వైద్యారోగ్య, పోలీసు సిబ్బంది, జర్నలిస్టులకు ప్రతిరోజూ సుమారు 1500 మందికి 41 రోజులపాటు నాణ్యమైన భోజనాన్ని అందించానని తెలిపారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచన మేరకు భోజన వితరణ కార్యక్రమా న్ని తాత్కాలికంగా ముగిస్తున్నామని చెప్పారు. జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. వలస కూలీలకు సీఎం కేసీఆర్‌ మంచి భోజనాన్ని పెట్టి వారి స్వస్థలాలకు పంపించారని అన్నా రు. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భోజనం అందించి   ఎమ్మెల్యే అం డగా నిలిచారని, ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకున్నారని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో 14 కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేయడంతో భోజన వితరణ కార్యక్రమా న్ని ముగించారని తెలిపారు. కార్యక్రమానికి  హాజరైన జడ్పీచైర్మన్‌ విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, ఆకుల లలిత, మేయర్‌ నీతూకిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయలను ఎమ్మెల్యే సన్మానించారు. రెడ్‌కో చైర్మన్‌ అలీం, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మేయర్‌ సుజాత పాల్గొన్నారు. అనంతరం గంగాస్థాన్‌లో చెత్త నుంచి వివిధ పదార్థాలను వేరు చేసేందుకు ఏర్పాటు చేసిన జాలీలను, బోధన్‌ రోడ్డులో  కెనాల్‌ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.


logo