శనివారం 30 మే 2020
Nizamabad - May 12, 2020 , 01:56:41

స్వీయ నియంత్రణ పాటించాలి

స్వీయ నియంత్రణ పాటించాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని  విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో ఆశ కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర వస్తువులను ఆయన సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. 3650 మందికి రూ.18.50 లక్షల విలువైన సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కలెక్టర్‌ శరత్‌ కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై  చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జాహ్నవి, టీఆర్‌ఎస్‌ నాయకులు ముజీబుద్దీన్‌, వేణుగోపాల్‌రావు, పిప్పిరి వెంకటి తదితరులు పాల్గొన్నారు.logo