బుధవారం 27 మే 2020
Nizamabad - May 11, 2020 , 02:08:20

కరోనా నివారణ చర్యలు ఎలా ఉన్నాయి?

కరోనా నివారణ చర్యలు ఎలా ఉన్నాయి?

కమ్మర్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూర్‌లో లాక్‌డౌన్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. గ్రామంలో కరోనా నివారణ చర్యలు ఎలా అమలవుతున్నాయని సర్పంచ్‌ ఏనుగు పద్మ, ఏఎన్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాసాకొత్తూర్‌ వాస్తవ్యుడు, రిటైర్డు కలెక్టర్‌ అంబరీశ్‌ పాఠశాల కోసం ఉచితంగా అందజేసిన ఇంటిని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. గ్రామంలో విద్యాభివృద్ధికి ఈ ఇంటిని ఉపయోగించుకుందామని పేర్కొన్నారు.


logo