శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - May 11, 2020 , 02:08:20

కరోనాను కట్టడి చేయగలిగాం

కరోనాను కట్టడి చేయగలిగాం

  • ఇదే స్ఫూర్తి కొనసాగించాలి 
  • ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచాలి 
  • ధాన్యం కొనుగోళ్ల పై మరింత వేగం పెంచాలి 
  • అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ: కొవిడ్‌ -19ను ఇప్పటికే కట్టడి చేయగలిగామని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, కరోనాపై విస్తృతంగా ప్రచారం చేసి, కట్టడికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్ర ఆర్‌అండ్‌ బీ, హౌసింగ్‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌-19, ధాన్యం సేకరణ, ఎరువుల లభ్యత, రుణమాఫీ అంశాలపై ఆదివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. కరోనా సమస్య సమసిపోలేదని, ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కఠినంగా ఉంటేనే మనం గ్రీన్‌జోన్‌లోకి వెళ్లగలుగుతామన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు మూడు సూచనలు చేశారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వా రంటైన్‌లో ఉంచాలన్నారు. దీర్ఘకాలిక జబ్బులున్న వారిని గుర్తించి వారికి సకాలంలో మందులు, చికి త్స జరిగేలా చూడాలని తెలిపారు.  

ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలి.. 

ధాన్యం కొనుగోళ్లలో అధికారులు మరింత వేగం పెంచాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. ఆరు లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వ స్తుందని అంచనా ఉండగా.. 5.25 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు గ్రౌండ్‌ రిపోర్టును బట్టి తెలుస్తోందన్నారు. ఇప్పటికే 65శాతం ధాన్యం సేకరించామని, బోధన్‌లో 55 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. హమాలీల కొరత ఉన్న నేపథ్యంలో అక్కడి హమాలీలను దగ్గరలోని రైస్‌మిల్లులకు అటాచ్‌ చేయాలని సూచించారు. ధాన్యం సేకరించేందుకు లోకల్‌ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, వాటికి వెంటనే పర్మిషన్‌ ఇచ్చి ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.

యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలి

తగినంత యూరియా, డీఏపీని రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారుల కు సూచించారు. జూలై నాటికే వరి నాట్లు వేస్తారని, 75శాతం ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉం చాలన్నారు. ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రూ.25వేల లోపు రుణమాఫీకి అర్హులై ఉండి బ్యాంక్‌ లింకేజీ లేని రైతులు తమ ఆధార్‌ కార్డును ఏఈవోలు, సొసైటీలో గాని ఇవ్వాలని మంత్రి సూ చించారు. సమావేశంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, బీఎస్‌ లత, డీసీవో సింహాచలం పాల్గొన్నారు.


logo