బుధవారం 27 మే 2020
Nizamabad - May 10, 2020 , 02:39:07

కరోనా నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల

విద్యానగర్‌ : దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం కామారెడ్డి జిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని అభినందించారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు రెఫర్‌ చేయాలని, పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో వందశాతం కాన్పులు చేయడంతోపాటు పిల్లలకు టీకాలు వేయాలన్నారు. వీసీలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, కామారెడ్డి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo