ఆదివారం 31 మే 2020
Nizamabad - May 08, 2020 , 06:35:53

అమాత్యుడి ఔదార్యం

అమాత్యుడి ఔదార్యం

  • వలస కార్మికులకు భోజనం, రవాణా సౌకర్యం కల్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • ధన్యవాదాలు తెలిపినవలస కూలీలు

బాల్కొండ(ముప్కాల్‌): కరోనా తెచ్చిన కష్టాలతో నెత్తిన మూటా ముల్లే  సర్ధుకుని, చిన్నపిల్లలను చంకనెత్తుకుని కిలోమీటర్ల కొద్ది కాలినడకన తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలిచారు. మంత్రి సొంత ఖర్చులతో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేశారు. వలస కూలీలకు కడుపునిండా భోజనం పెట్టి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ గ్రామం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నదానాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు వెళ్తున్న 250 మంది వలస కూలీలకు శ్రీరాంపూర్‌ చిలుకల చిన్నమ్మ ఆల యం వద్ద భోజన వసతి ఏర్పాట్లు చేశారు. భోజనాల అనంతరం వలస కూలీలను నాలుగు డీసీఎం వ్యాన్లలో మహారాష్ట్ర సరిహద్దు వరకు తరలించారు. వలస కూలీల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని టీఆర్‌ఎస్‌ బాల్కొండ మండల అధ్యక్షుడు బద్ధం ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భం గా వలస కూలీలు జై తెలంగాణ, జై కేసీఆర్‌ అని నినాదాలు చేశారు. తమ పిల్లలకు కడుపునిండా భోజనం తినిపించి తెలంగాణ సరిహద్దు వరకు పంపేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. టాటా చెబుతూ వాహనాల్లో వారు ఎంతో సంతోషంగా వారి రాష్ర్టాలకు తరలివెళ్లారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి వెంకటేశ్‌, తౌటు గంగాధర్‌, వైస్‌ ఎంపీపీ శ్రీకాం త్‌ యాదవ్‌, పుప్పల విద్యాసాగర్‌, గ్రామ సర్పంచ్‌ మంథని చిన్నయ్య, ఉప సర్పంచ్‌ పెద్ది గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సాగర్‌ యాద వ్‌, బాల్‌ రాజేశ్వర్‌, కన్న పోశెట్టి, మామిడి రాకేశ్‌ , సుదర్శన్‌, లక్ష్మీనారాయణ, శ్యాంసుందర్‌, గంగయ్య, రియాజ్‌, అలీ పాల్గొన్నారు. 

మంత్రి  ఆదేశాలతోనే..

మంత్రి  ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలతో   వలస కూలీలకు అన్నదానం ఏర్పాటు చేసి వారిని తెలంగాణ సరిహద్దు వరకు తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించాం. నాలుగు డీసీఎంలలో 250 మంది వలస కూలీలను తరలించాం.

-బద్ధం ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ బాల్కొండ మండల అధ్యక్షుడు

మంత్రికి రుణపడి ఉంటాం..  

భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి  హైద రాబాద్‌ నుంచి మా  గ్రామానికి కాలినడ కన బయలుదేరా. మాకు భోజనం పెట్టి వాహనంలో పంపిన మంత్రికి రుణపడి ఉంటాం.

  -బర్షన్‌, వలస కూలీ, ఛత్తీస్‌గఢ్‌ 


logo