శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 08, 2020 , 06:35:58

ఎక్కడెక్కడోళ్లకు ఎంతో భరోసా..

ఎక్కడెక్కడోళ్లకు ఎంతో భరోసా..

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఎక్కడెక్కడో చిక్కుకు పోయి సాయం కోరిన ఎందరినో ఆమె ఆదుకుంటున్నారు. సాయం కోరిన వెంటనే స్పందించి నేనున్నాననే భరోసాను ఆమె కల్పిస్తున్నారు. ఈ ఆపత్కాలంలో ఆమె సేవలు, దాతృత్వాన్ని వేన్నోళ్ల కీర్తిస్తున్నారు.

 నందిపేట్‌ రూరల్‌ : లాక్‌డౌన్‌ కారణంగా బెంగళూరులో చిక్కుకు పోయిన ఐదుగురు తెలంగాణ విద్యార్థులకు నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. నిజామాబాద్‌ జిల్లా వెల్మల్‌ గ్రామానికి చెందిన అల్లకొండ శ్రీనివాస్‌, నల్లగొండ జిల్లాకు చెందిన సయేందర్‌, మంచిర్యాల జిల్లాకు చెందిన సౌమిత్‌, హైదరాబాద్‌కు చెందిన హరిప్రసాద్‌, జి.విజయ్‌ అనే విద్యార్థులు బెంగళూరులో విద్యనభ్యసిస్తున్నారు. లాక్‌డౌన్‌తో వారు అక్కడే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో తమ కుమారుడు బెంగళూరులో ఉండిపోయాడని, అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఎలాగైనా తన కుమారుడిని ఇంటికి చేర్చాలని ఐదుగురు విద్యార్థుల్లో ఒకరైన వెల్మల్‌ గ్రామానికి చెందిన అల్లకొండ శ్రీనివాస్‌ తండ్రి ఈనెల 3న  ఫోన్‌ ద్వారా మాజీ ఎంపీ కవిత దృష్టికి  తీసుకెళ్లారు. స్పందించిన ఆమె వెంటనే తన సహాయకులతో ఏర్పాట్లు చేయించి తన ఖర్చుతో ఇన్నోవా కారులో బెంగళూరు నుంచి ఐదుగురు విద్యార్థులను వారి ఇండ్లకు చేర్చారు. విద్యార్థులు గురువారం ఇండ్లకు క్షేమంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. లాక్‌డౌన్‌తో 40 రోజులుగా బెంగళూరులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఒక్క ఫోన్‌కాల్‌ చేసి విజ్ఞప్తి చేయగా.. వెంటనే ఆమె స్పందించారు. దీనికి గాను విద్యార్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.    

  మొన్న.. 

మహారాష్ట్రలోని అమరావతిలో ఉండి లాక్‌డౌన్‌తో ఇంటికి రాలేక సతమతమవుతున్న తెలుగు రాష్ర్టాలకు చెందిన పలువురు విద్యార్థులను వారి ఇండ్లకు చేర్చారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆయా రాష్ర్టాల అధికారులతో మాట్లాడి, అన్ని అనుమతులు తీసుకొని.. తన సొంత డబ్బులతో అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చి తల్లిదండ్రుల మనసు కుదుటపడేలా చేశారు ఆమె. 

 నిన్న.. 


బ్యాంక్‌ కోచింగ్‌ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లి, లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయిన 650 మంది తెలంగాణ విద్యార్థులను తన సొంత డబ్బులతో క్షేమంగా ఇంటికి చేర్చారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.

నేడు.. 

 తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు  లాక్‌డౌన్‌తో బెంగళూరులో చిక్కుకు పోయా రు. ఆపన్నహస్తం అందించాల ని విద్యార్థులు కవితను  కోరా రు. వెంటనే స్పందించిన మాజీ ఎంపీ  వారిని గురువారం  ఇంటికి చేర్చారు. 


logo