శనివారం 30 మే 2020
Nizamabad - May 07, 2020 , 01:24:40

మిగిలింది.. ఎనిమిది

మిగిలింది.. ఎనిమిది

  • కరోనా నుంచి కోలుకున్న 53 మంది బాధితులు
  • నమోదు కాని కొత్త కేసులు
  • త్వరలో గ్రీన్‌జోన్‌లోకి నిజామాబాద్‌ జిల్లా

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ జిల్లాలో 61 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. వైరస్‌ బారిన పడినవారిని గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండడంతో ఒక్కొక్కరూ కోలుకుంటున్నారు. కరోనా కోరల నుంచి బయటపడి ఇంటికి చేరుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. బుధవారం మరో ముగ్గురు డిశ్చార్జ్‌ కావడంతో ఇప్పటి వరకు కరోనాతో కోలు కున్న వారి సంఖ్య  53కు  చేరింది. దీంతో జిల్లాలో ఇంకా ఎనిమిది యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తున్నది. కోలుకుని ఇంటికి వచ్చిన వారిని అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. వీరు కూడా త్వరలోనే కోలుకునే అవకాశం ఉంది. దీంతో నిజామాబాద్‌ జిల్లా ఆరెంజ్‌ జోన్‌ నుంచి త్వరలోనే గ్రీన్‌జోన్‌లోకి రానున్నది. బాధితులు కోలుకోవడం, జిల్లాలో కొత్తకేసులు లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్నది. 

హోం క్వారంటైన్‌ పూర్తి..

నార్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో ఐదుగురి హోం క్వారంటైన్‌ ముగిసినట్లు అధికారులు తెలిపారు. వీరు మర్కజ్‌, అజ్మీర్‌కు వెళ్లి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించి 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచారు. హోం క్వారంటైన్‌ గడువు ముగియడంతో తహసీల్దార్‌ సతీశ్‌కుమార్‌, వైద్యుడు విజయ్‌కుమార్‌, ఎస్సై విజయ్‌కుమార్‌ బుధవారం వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.


logo