శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 07, 2020 , 01:24:41

వైభవంగా నృసింహ జయంతి

వైభవంగా నృసింహ జయంతి

మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి శతఘటాభిషేకం (వంద కలశాలతో) పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలోని మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు కొనసాగాయి. కార్యక్రమంలో ఈవో వెంకట్‌నారాయణ, ఆలయ సిబ్బంది కె.సంతోష్‌, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పరంధామాచార్యులు, నరసింహాచార్యులు, సంజీవాచార్యులు పాల్గొన్నారు. 

నిరాడంబరంగా నృసింహ స్వామి జయంతి

ధర్పల్లి: నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

నేడు లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణోత్సవం

దిలావర్‌పూర్‌: నిర్మల్‌ జిల్లాలోనే ప్రసిద్ధ దేవాలయమైన మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణాన్ని గురువారం వేద పండితుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు.


logo