శనివారం 06 జూన్ 2020
Nizamabad - May 06, 2020 , 02:50:23

‘కరోనా’ కాలం.. కవితమ్మ ఔదార్యం

 ‘కరోనా’ కాలం.. కవితమ్మ ఔదార్యం

  •  గల్లీ నుంచి గల్ఫ్‌ దేశాల వరకూ
  • ఆపదలో ఉన్న తెలంగాణవాసులకు భరోసా కల్పిస్తున్న జాగృతి అధ్యక్షురాలు 

‘కరోనా’ కాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు నిజామాబాద్‌ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలి తీరుస్తూ నేనున్నానంటూ వారి కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే స్పందిస్తూ ‘జాగృతి’ వేదికగా చేయూతను అందిస్తున్నారు.  తెలంగాణవాసులు ఎక్కడ ఆపదలో ఉన్నా.. వారిని తక్షణమే ఆదుకుంటున్నారు మాజీ ఎంపీ కవిత.

- నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి

నిరుపేదలకు అండగా..

తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్న నిజామాబాద్‌కు చెందిన నిరుపేద బాలింత ఆర్తిని ఆదుకోవాలని ఆమె కుటుంబ సభ్యు లు మాజీ ఎంపీ కవితను ట్విట్టర్‌ ద్వారా సంప్రదించారు. తక్షణం స్పందించిన కవిత బాధితురాలిని హైదరాబాద్‌ తరలించి  చికిత్స చేయించారు. లాక్‌డౌన్‌ కార ణంగా కలకత్తాలో తిండి కోసం ఇబ్బందులు ఎదు ర్కొంటున్న నిజామాబాద్‌కు చెందిన 20 మంది యువకులకు నిత్యావసర సరుకులు అందేలా ఏర్పాట్లు చేశారు. ముంబయిలో ఉన్న తెలంగాణ వలస కార్మికులకు బియ్యం, నిత్యావసరాలతో పాటు వసతి ఏర్పాట్లు చేయించారు.అమరావతిలో చిక్కుకు పోయిన నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన 55 మంది విద్యార్థులను స్వస్థలాలకు రప్పించారు.

విదేశాల్లోనూ సాయం..  

గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు మాజీ ఎంపీ కవిత పిలుపు మేరకు   తెలంగాణ జాగృతి నాయకులు నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. లాక్‌డౌన్‌తో లండన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యార్థులకు కేవలం 11 గంటల్లోనే సహాయం అందించిన కవిత.. చెన్నైలో స్థిరపడిన నిజామాబాద్‌ కుటుంబం అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్‌కు  వచ్చేందుకు   అరగంటలోనే పాసుల ఏర్పాటు చేయించారు. సౌదీ అరేబియాలో మృతిచెందిన నిజామాబాద్‌ వాసి సాజిద్‌ అంత్యక్రియలకు సైతం  సాయం అందించారు.  

సర్కారు దవాఖానల్లో నిత్యాన్నదానం 

సర్కారు దవాఖానలో చికిత్స చేయించుకు నేందుకు వచ్చే రోగుల సహాయకుల కోసం చేస్తున్న నిత్యాన్నదానం ఎంతో మంది కడుపు నింపుతున్నది. లాక్‌డౌన్‌ వేళ ఇది పేద ప్రజలకు దేవుడి ప్రసాదంలా మారింది. గుక్కెడు నీళ్లు కూడా దొరకని సమయంలో బువ్వ పెట్టి సొంత అమ్మలా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు కవిత. వలస జీవులకు, దినసరి కూలీలకు ఆపత్కాలంలో అన్నం పెట్టి కడుపు నింపుతున్నారు. ప్రాణాలొడ్డి సేవలం దిస్తున్న వైద్యులకూ రెండుపూటలా భోజనాన్ని సమకూర్చి తోడుగా మేమున్నామనే ధైర్యాన్నిస్తున్నారామె. కరోనాపై పోరులో కష్టపడుతున్న వైద్యు లు, సిబ్బందికి రాత్రివేళ భోజనం అందించడం కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్ర దవాఖానలో ప్రత్యేకంగా అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయించారు.  

లాక్‌డౌన్‌లో నిరంతర సహకారం.. 

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వ దవాఖానల్లో రెండేండ్లుగా తన సొంత డబ్బులతో అన్నదాన కేంద్రాలను నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కవిత.. కరోనా వైరస్‌ నేపథ్యంలో మరో ముందడుగు వేశారు. లాక్‌డౌన్‌తో తిండి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, నిరుపేదల కష్టాలను చూసి చలించిన కవిత.. వారి కడుపు నింపేందుకు నిజామాబాద్‌, జగిత్యాలలో మరో మూడు అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. మొత్తం ఆరు అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతి రోజూ మూడు వేల మంది అన్నార్తులకు భోజనం అందిస్తున్నారు. 500 పీపీఈ కిట్లు.. 20వేల మాస్కులు తనవంతు సహా యంగా పంపించి  ఉదార త చాటుకున్నారు. ఆమె చూపిన బాటలో ఇతరులు కూడా నడు స్తూ తమవంతుగా పేదవారిని ఆదుకుంటున్నారు. 


logo