సోమవారం 01 జూన్ 2020
Nizamabad - May 04, 2020 , 01:33:38

కూతురిని పుట్టింటికి పంపలేదని దాడి

కూతురిని పుట్టింటికి పంపలేదని దాడి

  • చికిత్స పొందుతూ వియ్యంకుడి మృతి

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : తన కూతురిని పుట్టింటికి పంపించమని ఓ తండ్రి తన వియ్యంకుడి ఇంటికి వచ్చాడు. ఈ విషయంలో మాటామాట పెరగడంతో ఆ తండ్రి తన వియ్యంకుడిపై దాడి చేయడంతో ఆయన మృతిచెందిన ఘటన మండలంలోని హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. కమ్మర్‌పల్లి ఎస్సై ఆసిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేట్‌కు చెందిన బోదాసు రాజం ఈ నెల 2న తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హాసాకొత్తూర్‌కు వచ్చాడు. తన కొడుకు మిరేశ్‌ పని మీద బయటకు వెళ్లాడని, వచ్చాక తీసుకెళ్లమని అతడి వియ్యంకుడు రాములు చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాజం కర్రతో రాములు తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రాములును వెంటనే నిజామాబాద్‌లోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దాడికి పాల్పడిన రాజంను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


logo