శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - May 03, 2020 , 02:45:25

ఇదే స్ఫూర్తిని చాటాలి..

ఇదే స్ఫూర్తిని చాటాలి..

  • ప్రజల సహకారంతోనే కరోనా కట్టడిలో మంచి ఫలితాలు
  • ప్రస్తుతం అదుపులోనే మహమ్మారి విస్తృతి.. 
  • కామారెడ్డి సేఫ్‌ జోన్‌లో..
  • ఇది.. కనపడని శత్రువుతో అలుపెరగని పోరాటం 
  • కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌వో సమన్వయం అద్భుతం
  • ‘నమస్తే తెలంగాణ’తో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్నది. దీన్ని నియంత్రించేందు కు అన్ని దేశాలూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంతటి ప్రాణాంతకమైన వైరస్‌ను రూపుమాపడానికి   రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు పూనుకున్నది. సీఎం కేసీఆర్‌ పిలుపుతో రంగంలోకి దిగిన మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ కరోనా కట్టడికి అలుపెరగని కృషి చేస్తున్నారు. యం త్రాంగంతో కలిసి ముందడుగు వేస్తూ కామారెడ్డి జిల్లాను సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవ అంతా ఇంతా కాదు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితులను ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ డీసీసీబీ బాధ్యులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తూ పారదర్శకంగా పంట ఉత్పత్తుల సేకరణకు నడుం బిగించారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా మెరుగైన ఫలితాలు రాబడుతున్న వేళ రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రజల సహకారం అద్భుతం...

మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్‌ను సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మే నెల 7వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర ప్రభు త్వం కొన్నింటికి సడలింపులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటి వరకు 12 కరోనా పాజిటివ్‌ కేసులు బయట పడగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను త్వరితగతిన గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. మిగిలిన వారందరూ సేఫ్‌గా ఉండడం.. మూడు వారాలుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజల సహకారం అంతా ఇంతా కాదు.

యంత్రాంగం పనితీరు భేష్‌...

కామారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నది. కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎంహెచ్‌వోలు మొదటి నుంచీ ప్రత్యేక దృష్టి సారించి జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారందరినీ గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచా రు. విదేశాల నుంచి వచ్చిన వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని, వారికి హోంక్వారంటైన్‌ ముద్ర వేసి బయట తిరగకుండా కట్టడి చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబీకులతో పాటు ఢిల్లీకి వెళ్లివచ్చిన వారందరినీ ప్రభుత్వ సంరక్షణలో ఉం చారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా నిరంతరం శాఖ ల మధ్య సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదు పులోకి  తెచ్చా రు. కామారెడ్డి జిల్లా ప్రస్తుతం ఆరెంజ్‌జోన్‌లో కొనసాగుతుండగా త్వరలోనే గ్రీన్‌జోన్‌లోకి వస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

యావత్‌ దేశానికి తెలంగాణ ఆదర్శం...

లాక్‌డౌన్‌తో ప్రజలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా పెద్ద ఎత్తున ఉపశమన చర్యలు చేపట్టాం. కరోనా సంబంధిత అంశాల కోసం కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాం. ఇటువంటి విపత్కర సమయంలో దాతలు, మంచి మనసున్న వారెందరో పేదల కోసం ముందుకు వచ్చి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రేషన్‌ లబ్ధిదారులకు 12కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని విజయవంతంగా సరఫరా చేశాం. నిత్యావసరాల కోసం కుటుంబానికి రూ.1500 వారి ఖాతాల్లో జమ చేశాం. మే నెలలో అదనంగా రేషన్‌ కార్డుకు కిలో కంది పప్పు ఇవ్వడం ద్వారా ప్రజలకు భారీ ఊరట కలిగింది. ఇక ధాన్యం కొనుగోళ్లలోనూ రైతులకు ఇబ్బందుల్లేకుండా పటిష్ట ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రైతుచెంతకే వెళ్లి పంట ఉత్పత్తులు సేకరిస్తున్నాం. రానున్న కాలంలో సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలకు ప్రజలంతా ఇదే స్ఫూర్తితో మద్దతు తెలపాలని కోరుతున్నా. కరోనా పోరులో యావత్‌ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.


logo