గురువారం 28 మే 2020
Nizamabad - May 01, 2020 , 02:01:13

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • గురువారం ఒక్కరోజే 20వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ
  • ట్రాన్స్‌పోర్టుకు ఇబ్బంది లేకుండా 25 అదనపు వాహనాలు 
  • 24 గంటల్లో 504 లారీల్లోని ధాన్యం రైస్‌మిల్లులకు తరలింపు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు మేరకు కరోనా వైరస్‌ నేపథ్యంలో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రా మాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నా రు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నదన్నారు. గురువారం ఒక్కరోజే 20వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందు కు అనుగుణంగా మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు.  అంచనాలో 30 శాతం 1.83 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం అంచనాల్లో 27శాతం 1.62 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అన్‌లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. 

1.83 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ.. 

336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. సేకరించిన ధాన్యంలో 92 శాతం 1.68 లక్షల మెట్రిక్‌టన్నులను రైస్‌మిల్లులకు పంపించామన్నారు. గురువారం వరకు రూ.123 కోట్లు ప్రభుత్వం రైతులకు చె ల్లించిందని తెలిపారు.  

25 అదనపు వాహనాలు 

ట్రాన్స్‌పోర్టుకు ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్న వాహనాలతో పాటు పీఏసీఎస్‌ చైర్మన్లు, అధికారులు గురువారం 25 అదనపు వాహనాలు స మకూర్చారని మంత్రి తె లిపారు. గడిచిన 24 గంటల్లో 504 లారీల్లో ధా న్యం రైస్‌మిల్లర్లు అన్‌లోడ్‌ చేశారన్నారు. ధా న్యం చెడిపోయిందన్న సాకుతో కానీ, కడ్తా పేరుతో రైస్‌మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీ సుకోవాని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.  

చివరి గింజనూ కొనుగోలు చేస్తాం.. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హా మీ ఇస్తున్నామని మంత్రి అన్నారు. రైతులు చెప్పుడు మాటలు విని ఆందోళనకు గురికావొద్దని సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని తెలిపారు. రైతులెవరూ అధైర్య పడొద్దని ఈ సందర్భంగా మంత్రి భరోసానిచ్చారు.


logo