సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Apr 25, 2020 , 03:00:00

20 వేల మాస్కులు, 500 పీపీఈ కిట్లు

20 వేల మాస్కులు, 500 పీపీఈ కిట్లు

  • జిల్లా యంత్రాంగానికి అందజేసిన మాజీ ఎంపీ కవిత

ఖలీల్‌వాడి: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 500 పీపీఈ కిట్లు, 20 వేల క్లాత్‌ మాస్కులను అందజేశారని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో వీటిని శుక్రవారం కలెక్టర్‌కు నుడా చైర్మన్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ.. క్వారంటైన్‌ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఇవి చాలా ఉపయోగపడతాయని తెలిపారు. నుడా చైర్మన్‌ మాట్లాడుతూ.. మూడేండ్లుగా జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖాన, ఆర్మూర్‌, బోధన్‌ దవాఖాన, లైబ్రరీలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి మాజీ ఎంపీ కవిత దాతృత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో  లలితమహల్‌ థియేటర్‌ వద్ద వలస కూలీలకు, అభాగ్యులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారన్నారు. క్వారంటైన్‌లో పనిచేస్తున్న డాక్టర్లకు అభద్రతా భావం ఉండకూడదని 500 పీపీఈ కిట్లు, 20 వేల మాస్కులను అందజేశారన్నారు. ప్రజల తరఫున, టీఆర్‌ఎస్‌ నాయకుల తరఫున మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సూదం రవిచందర్‌, నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo